Jump to content

కృతికా రవీంద్ర

వికీపీడియా నుండి
కృతిక
జననం
కృతికా ఆర్

(1994-03-17) 1994 మార్చి 17 (వయసు 30)
సాగర, కర్ణాటక
వృత్తికన్నడ సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
వెబ్‌సైటుhttps://kruttikaravindra.com/

కృతికా (జననం 1994 మార్చి 17), కన్నడ టెలివిజన్, కన్నడ సినిమా నటి, ఆమె జీ కన్నడలో ప్రసారమైన "రాధా కళ్యాణ" టీవీ షోలో నటనకు ప్రసిద్ధి చెందింది. ఆమె కన్నడ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 3లో కూడా పాల్గొన్నది. ఇది 2015 అక్టోబరు 25 నుండి కలర్స్ కన్నడ ఛానెల్లో ప్రసారం చేయబడింది.[1] షో మొదటి రోజున ఆమె ప్రవేశించి 63 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

కృతికా కర్ణాటక సాగర్ తాలూకాలో హవ్యక బ్రాహ్మణ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి దివంగత డాక్టర్ రవీంద్ర, తల్లి మీనాకృతి మీనా, ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. కృతికా తన విద్యను సాగర్ లోని ఆనందపురంలో సాధన విద్యా కేంద్రంలో పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

కన్నడ చిత్రం 'పట్రే లవ్స్ పద్మ' తో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. జీ కన్నడలో ప్రసారమైన రోజువారీ సోప్ ఒపెరా 'రాధా కళ్యాణ' లో ప్రధాన పాత్ర పోషించి ఆమె ప్రసిద్ది చెందింది.[3] ఆమె కెంగులాబిలో ఈ భావోద్వేగ పాత్రలో నటించింది. యారిగే యారుంతులో కూడా ఆమె నటించింది.[4][2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2008 పాట్రె లవ్స్ పద్మ పద్మ
2009 ఆటో
2010 లిఫ్ట్ కోడ్లా
2018 కెంగులాబి షరీ
2018 యారిగే యారుంతు ప్రియా
2021 మారిచా[5] ప్రతిమా
2021 శార్దుల దీక్ష

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్
2010 మానే మగలు ఇంచారా ఉదయ టీవీ
2011 - 2015 రాధా కళ్యాణ రాధ జీ కన్నడ
2023-ప్రస్తుతము భూమిగే బందా భాగవత గిరిజా జీ కన్నడ

మూలాలు

[మార్చు]
  1. "9 Things You Must Know About Bigg Boss Kannada Contestant Kruttika Ravindra". Desimartini (in ఇంగ్లీష్). 2015-12-23. Retrieved 2021-07-25.
  2. 2.0 2.1 "Kruttika has taken 3 bold steps into Sandalwood". Bangalore Mirror (in ఇంగ్లీష్). August 15, 2018. Retrieved 2021-07-25.
  3. "Chandan Kumar completes a decade in the Kannada entertainment industry: A look at his journey". The Times of India (in ఇంగ్లీష్). 2020-11-09. Retrieved 2021-07-25.
  4. https://www.indiaglitz.com/kengulabi-complete-bhandage-confident-kannada-news-183355 Kannada Movie
  5. "Nataraj turns undercover cop in a Sudheer Shanbhogue directorial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.