కృషీవలుడు
కృషీవలుడు దువ్వూరి రామిరెడ్డి (1895-1947) రచించిన పద్యకావ్యం. ఇది ప్రధానంగా కృషి అనగా వ్యవసాయం ఆధారంగా జీవించే వ్యక్తుల, కుటుంబాల గురించి విశ్లేషించింది. కృషీవలుడు అనగా వ్యవసాయదారుడు లేదా రైతు అని నిఘంటువులో పేర్కొన్న అర్ధం.
దీని ద్వితీయ సంస్కరణ సరస్వతీ భాండారము వారిచే 1924లో ముద్రించబడింది. ఈ ముద్రణలో రచయిత మొదటి ముద్రణలోని కొన్ని పద్యాలను సవరించగా, కొన్నింటిని కొత్తగా చేర్చారు.
ఈ కావ్యానికి ప్రముఖ విద్యావేత్త, సాహిత్యకారుడైన కట్టమంచి రామలింగారెడ్డి గారు విపులమైన ఉపోద్ఘాతాన్ని అందించారు.
అంకితము
[మార్చు]ఈ పద్యకావ్యాన్ని రచయిత తన మిత్రుడైన మన్నెము శేషురెడ్డికి అంకితం ఇచ్చాడు. ఆ సందర్బన్ననుసరించిన ప్రేమాంకములో ఈ క్రింది పద్యాన్ని రచించారు:
శా|| అన్నా మన్నెము శేషురెడ్డి, యెటులో
యావిర్భవంబొంది స్నే
హౌన్నత్యంబు పరస్పరంబు రమణీ
యానేక భావంబులం
జెన్నారెన్ హృదయానుబంధర చనా
చిహ్నంబుగన్, మాఱుపా
టెన్నండుం దలచూప దిందనుక దై
వేచ్ఛాప్రభావంబునన్.
తే. గీ. అట్టి నిర్మలమైత్రికి నానవాలు
నవ్యకవితాసుమంబుల దివ్యమాల
నెమ్మి గీలించుచున్నాడ నీదుకీర్తి
కామినీ కంఠసీమను గాంతు లొలయ.