Jump to content

కెంగం సూర్యారావు

వికీపీడియా నుండి
కెంగం సూర్యారావు
కెంగం సూర్యారావు


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు కె. నారాయణరావు
తరువాత కె. నారాయణరావు
నియోజకవర్గం పర్లాకిమిడి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

కెంగం సూర్యారావు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కె. సూర్యారావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేడీ అభ్యర్థి కె. నారాయణరావుపై 1419 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సూర్యారావుకి 61014 ఓట్లు రాగా, నారాయణరావు కు 59595 ఓట్లు వచ్చాయి. ఆయన 2019లో ఎన్నికలలో పోటీ చేసి తన సమీప బీజేడీ అభ్యర్థి కె. నారాయణరావు చేతిలో 15335 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

కె. సూర్యారావు 2019 జూన్ 11న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[1], రాజకీయాలకు దూరంగా ఉంటూ 2024 ఒడిశాలో ఎన్నికలకు ముందు మార్చి 31న భువనేశ్వర్‌లో సీనియర్ బిజెడి నాయకుల సమక్షంలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార పార్టీలో రావు చేరారు. భువనేశ్వర్‌లోని బీజేడీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్‌లో  రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర సమక్షంలో బిజూ జనతాదళ్ పార్టీలో చేరాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (11 June 2019). "Cong. ex-MLA resigns in Odisha" (in Indian English). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  2. Sakshi (31 March 2024). "జేఎంఎం అభ్యర్థిగా అంజనీ సోరెన్‌". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  3. Odisha Bytes (30 March 2024). "Former Congress MLA K Surya Rao Joins BJD Ahead Of Elections In Odisha". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.