కెన్ రూథర్‌ఫోర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెన్నెత్ రూథర్‌ఫోర్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెన్నెత్ రాబర్ట్ రూథర్‌ఫోర్డ్
పుట్టిన తేదీ (1965-10-26) 1965 అక్టోబరు 26 (వయసు 58)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులుహమీష్ రూథర్‌ఫోర్డ్ (కొడుకు)
ఇయాన్ రూథర్‌ఫోర్డ్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 155)1985 మార్చి 29 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1995 మార్చి 22 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 50)1985 మార్చి 27 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1995 ఏప్రిల్ 1 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1994/95Otago
1995/96–1999/00Transvaal/Gauteng
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 56 121 220 248
చేసిన పరుగులు 2,465 3,143 13,974 6,888
బ్యాటింగు సగటు 27.08 29.65 39.92 31.59
100లు/50లు 3/18 2/18 35/67 6/44
అత్యుత్తమ స్కోరు 107* 108 317 130*
వేసిన బంతులు 256 389 1,729 862
వికెట్లు 1 10 22 21
బౌలింగు సగటు 161.00 32.30 46.00 33.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/38 2/39 5/72 3/26
క్యాచ్‌లు/స్టంపింగులు 32/– 41/– 180/– 91/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 4

కెన్నెత్ రాబర్ట్ రూథర్‌ఫోర్డ్ (జననం 1965, అక్టోబరు 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ జాతీయ జట్టుతో పదేళ్ళపాటు కొనసాగాడు. 1990లలో కొంతకాలం కెప్టెన్‌గా ఉన్నాడు. న్యూజీలాండ్‌కు 50వ వన్డే క్యాప్ తో ఉన్నాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

19 సంవత్సరాల వయస్సులో 1984–85లో వెస్టిండీస్‌లో న్యూజీలాండ్ పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్డ్ మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు.[1] [2]

1985-86లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాలేదు. షెల్ ట్రోఫీలో మూడు సెంచరీలతో 53.16 సగటుతో 638 పరుగులు చేశాడు.[3] ఆ తర్వాత 1986 ప్రారంభంలో ఆస్ట్రేలియా న్యూజీలాండ్‌లో పర్యటించినప్పుడు, టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మిడిల్ ఆర్డర్ తో వచ్చి మూడు టెస్టుల్లో రెండు అర్ధశతకాలు సాధించాడు.

35 ఫస్ట్-క్లాస్ సెంచరీల చేశాడు. మూడు సంవత్సరాలపాటు న్యూజీలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 18 ప్రయత్నాలలో రెండు టెస్టు విజయాలు సాధించాడు.

వన్ డే ఇంటర్నేషనల్స్‌లో కెప్టెన్‌గా పది మ్యాచ్‌లు గెలిచాడు. భారత్‌పై అత్యధిక అంతర్జాతీయ స్కోరు (108 పరుగులు) సాధించాడు. 1992 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న న్యూజీలాండ్ జట్టులో సభ్యుడు.[4]

క్రికెట్ తర్వాత[మార్చు]

1997 న్యూ ఇయర్ ఆనర్స్‌లో, రూథర్‌ఫోర్డ్ క్రికెట్‌కు సేవలకు న్యూజీలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో సభ్యునిగా నియమించబడ్డాడు.[5]

రూథర్‌ఫోర్డ్ 1995లో తన ఆత్మకథ, ఎ హెల్ ఆఫ్ ఎ వే టు మేక్ ఎ లివింగ్‌ను ప్రచురించాడు. మైక్ క్రీన్‌తో కలిసి అతను యువ క్రికెటర్ల కోసం 1992లో కెన్ రూథర్‌ఫోర్డ్స్ బుక్ ఆఫ్ క్రికెట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు.[6]

క్రికెట్ ఆట నుండి రిటైర్మెంట్ తర్వాత, ఐరిష్ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.

రెండు సంవత్సరాలు ఐర్లాండ్ జాతీయ జట్టుకు కోచింగ్ చేసిన తర్వాత గుర్రపు పందాలపై తన ఆసక్తిని అనుసరించాడు. న్యూజీలాండ్ టిఎబి కోసం హెడ్ బుక్‌మేకర్‌గా పని చేయడానికి తిరిగి వచ్చాడు. సింగపూర్‌లో అదే పాత్రను పోషించాడు. తిరిగి దక్షిణాఫ్రికాలో రేసింగ్ బ్రాడ్‌కాస్టర్ టెలీట్రాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. 2013[7] నుండి వైకాటో రేసింగ్ క్లబ్ జనరల్ మేనేజర్ గా ఉన్నాడు.[4] 2019 చివరిలో న్యూ సౌత్ వేల్స్‌లో ఇదే విధమైన పాత్రను చేపట్టడానికి వైకాటో రేసింగ్ క్లబ్‌ను విడిచిపెట్టాడు.[8]

స్కై నెట్‌వర్క్ టెలివిజన్‌కి క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "The New Zealanders in West Indies, 1984–85", Wisden 1986, pp. 953–66.
  2. "A debut double". ESPN Cricinfo. 12 April 2008. Retrieved 29 April 2019.
  3. Shell Trophy batting averages 1985–86. Cricketarchive.com. Retrieved on 27 May 2018.
  4. 4.0 4.1 Anderson, Ian (13 December 2014). "Ken Rutherford digs in on racing's sticky wicket". Where are they now?. Stuff.co.nz. Retrieved 22 December 2014.
  5. "New Year honours list 1997". Department of the Prime Minister and Cabinet. 31 December 1996. Retrieved 15 December 2019.
  6. National Library of New Zealand Catalogue[permanent dead link] Retrieved 3 July 2013.
  7. Rodley, Aidan (26 April 2013). "Rutherford lands job at Waikato Racing Club". Stuff.co.nz. Retrieved 22 December 2014.
  8. "Racing: Waikato Racing Club boss Ken Rutherford off to New South Wales". NZ Herald (in ఇంగ్లీష్). Retrieved 2020-12-26.

బాహ్య లింకులు[మార్చు]