కె.చిరంజీవి

వికీపీడియా నుండి
(కె.చిరంజీవి: నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కె. చిరంజీవి సాహితీవేత్త, నటుడు, ప్రయోక్త, రేడియో ప్రముఖుడు. ఈయన రేడియో చిరంజీవిగా సుపరిచితుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ప్రకాశం జిల్లా వైదన గ్రామంలో కుంటముక్కల రామదాసు, రామమ్మ దంపతులకు 1935 మార్చి 18న చిరంజీవి జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం చేసారు.1961 ఏప్రిల్‌ 1 నుంచి ఆకాశవాణి హైదరాబాదు‌ కేంద్రంలో 32 సంవత్సరాల పాటు పనిచేసి 1993 మార్చి 17న పదవీ విరమణ పొందారు.

కళారంగం

[మార్చు]

సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రయోజనాత్మక రచనలు వెలువరించిన గొప్ప మానవతావాది ఆయన. మూడు దశాబ్దాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగంలో డ్రామ voice గా పైచేసి చిరంజీవి పదవీ విరమణ చేసారు. చక్కటి కంఠ స్వరం గల చిరంజీవి మంచి రచయిత కూడా. నాటకాలు శ్రవ్య మాధ్యమానికి సరి పడేలా రూపొందించడములో సిద్ధ హస్తులు. ఆయన 'స్వతంత్ర భారత్ కీ జై ' నవల వ్రాశారు.భారతీయ సాహిత్యంలో ఇది ఒక అపురూపమైన రచన. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం 1985లో ఉత్తమ నవల బహుమతి ఇచ్చింది. ఆయన "రేడియో నాటికలు" అనే గ్రంథాన్ని ఒక సంకలనంగా ప్రచురించారు. ఈ గ్రంథానికి 1986లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటక సంకలనం బహుమతి ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఆసియా పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బ్రాడ్‌కాస్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ చిరంజీవి రాసిన ‘ఆకలిమందు’ నాటికను ఒక నమూనా రేడియో నాటకంగా వాడుకున్నారు. చిరంజీవి జీవితమంతా నాటకాలు, సాహిత్యంతోనే గడిచిపోయింది. 1957లో హైదరాబాదు‌ నుంచి వెలువడే సోషలిస్టు పార్టీ పత్రిక నవశక్తిలో, రేడియోలో రిటైర్‌ అయిన తర్వాత 1996-2008 మధ్యకాలంలో శారదతో కలిసి స్టూడియోగ్రాఫ్‌ పేరుతో ఒక యాడ్‌ ఏజెన్సీ నడిపారు. ఈయన రాసిన రచనలపై విద్యార్థులు పలు యూనివర్సిటిలలో పోస్టుగ్రాడ్యుయేట్‌ పరిశోధనలు చేశారు.[2]

నాటకాలు

[మార్చు]
  1. నీలిదీపాలు
  2. సోనార్‌ బంగ్లా
  3. ఇక్కడ పెళ్ళి చేయబడును
  4. ప్రేమపక్షులు
  5. దేవుడెరుగని నిజం
  6. శ్రీకృష్ణ శిరోభారం
  7. వంశాంకురం
  8. కొక్కొరోకో
  9. బీళ్లు తిరగబడుతున్నాయి
  10. శాంతి సమరం
  11. కాల యంత్రం
  12. ఆకలి మందు
  13. పోలిట్రిక్స్‌
  14. ఉరోల్లు మేల్కొంటున్నారు
  15. మహా నిష్క్రమణం.

నవలలు

[మార్చు]
  1. ముళ్ల గులాబి
  2. అనంతయాత్ర
  3. ఎక్కడికీ ప్రస్థానం
  4. బోలో స్వతంత్ర భారత్‌కీ జై
  5. చీమ మనుషులు
  6. రెండు కన్నీటి చుక్కలు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చిరంజీవికి ముగ్గురు సంతానం. కుమార్తెలు కవిత, నవత, కుమారుడు చైతన్య ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయన సెప్టెంబరు 23 2014 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, రాష్ట్రీయం (23 September 2014). "రేడియో చిరంజీవి అస్తమయం". www.andhrajyothy.com. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.
  2. "నాటక ప్రయోక్త శాశ్వత విశ్రాంతి". Archived from the original on 2020-01-20. Retrieved 2015-07-15.

ఇతర లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: