వైదన
వైదన | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°57′37″N 79°57′44″E / 15.9603234°N 79.9622512°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | బల్లికురవ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,182 |
- పురుషుల సంఖ్య | 1,583 |
- స్త్రీల సంఖ్య | 1,599 |
- గృహాల సంఖ్య | 811 |
పిన్ కోడ్ | 523303 |
ఎస్.టి.డి కోడ్ | 08404 |
వైదన (vaidena) , బాపట్ల జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 811 ఇళ్లతో, 3182 జనాభాతో 1648 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1583, ఆడవారి సంఖ్య 1599. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 737 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 104. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590688[1].పిన్ కోడ్: 523303.
భౌగోళికం[మార్చు]
ఇది మండల కేంద్రమైన బల్లికురవ నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
గ్రామానికి తూర్పు దిశగా కొమ్మినేనివారి పాలెం, ఉత్తరంగా సూరేపల్లి, శంకరలింగం గుడిపాడు, దక్షిణంగా కొప్పెరపాడు, గోవాడ, పడమరగా గొర్రెపాడు, కూకట్లపల్లి ఉన్నాయి
జనగణన[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,513. ఇందులో పురుషుల సంఖ్య 1,806, మహిళల సంఖ్య 1,707, గ్రామంలో నివాస గృహాలు 773 ఉన్నాయి.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మేడా సుభాషిణి, 1,000 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైంది.[2]
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల బల్లికురవలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అద్దంకిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల అద్దంకిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అద్దంకిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు గుంటూరులోనూ ఉన్నాయి.
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలను 1953 లో స్థాపించారు.ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన లక్ష్మీసాయి, బొమ్మిశెట్టి అజిత్‌కుమార్ అను విద్యార్థులు, 2017-18 సంవత్సరంలో ఐ.ఐ.ఐ.టిలో ప్రవేశం పొందినారు.[3]
రవాణా సౌకర్యాలు[మార్చు]
నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి గ్రామానికి చాలా దగ్గరలో ఉంది. నర్సరావుపేట ఒంగోలు వయా అద్దంకి బస్సు సౌకర్యం ఉంది. అద్దంకి - చిలకలూరిపేట (వయా బల్లికురవ) రహదారి గ్రామంలోగుండా పోతుంది.
బ్యాంకింగు[మార్చు]
దగ్గరిలో బ్యాంకు శాఖ కొప్పెరపాడు లో గలదు.
భూమి వినియోగం[మార్చు]
భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 268 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 118 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 30 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 5 హెక్టార్లు
- బంజరు భూమి: 347 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 879 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 421 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 810 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
వైదన గ్రామానికి ఉత్తర దిక్కులో సుమారు 23.55 ఎకరాలలో చిన్న చెరువు విస్తరించి ఉంది. ప్రస్తుతం చెరువులో 50% ఆక్రమణకు గురైనది. అక్కడ మాగాణి సాగు చేపట్టినారు. ఈ కారణంగా ఆయకట్టులోని మాగాణి భూమిలకు నీరు అందే పరిస్థితి లేదు.[4] సాగర్ కుడి కాలువ ఊరిలో నుంచి పోవడం వల్ల పంటలు బాగా పండుతాయి. ఈ కాలువపై సూక్ష్మ జలవిద్యుత్ ప్రాజెక్టు కట్టారు.
- కాలువలు: 744 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 5 హెక్టార్లు
- చెరువులు: 61 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
ప్రధాన పంటలు[మార్చు]
వరి ప్రధాన పంట. దాని తరువాత రెండో పంటగా మొక్కజొన్న, మినుము, పెసర, మిరప, నువ్వులు ప్రధాన పంటలు. ఎండాకాలంలో నీటి వసతి ఉన్నవారు కూరగాయలు పండిస్తున్నారు
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- శివాలయం,
- శ్రీ రామాలయం,
- శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం.
- శ్రీ పొలేరమ్మ తల్లి ఆలయం
- గాలం రామక్రిష్న గారి పొలంలో నాగవేంద్ర స్వామి పుట్ట,
- మసీదు.
- చర్చి.
ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామంలో 90% ప్రధాన వృతి వ్యవసాయంగా ఉంది. మిగిలిన 10% ప్రజల ప్రధాన వృతి రైతు కూలి పని.
ప్రముఖులు[మార్చు]
ప్రముఖ సాహితీవేత్త, నటుడు, రేడియో ప్రయోక్త, కె.చిరంజీవి , 1939, మార్చి-19న ఈ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. వీరు హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సమగ్రసాహిత్యంపై పి.హెచ్.డి., తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో, "రేడియో నాటకాలు" అను అంశంపై ఎం.ఫిల్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, "నవలలు" అను అంశంపై పి.హెచ్.డి. చేసారు. 1961 నుండి ఆకాశవాణి హైదరాబాదులో 32 సంవత్సరాలు పనిచేసారు. సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రయోజనాత్మక రచనలు చేసారు. వీరి రచనలలో, "బోలో స్వతంత్ర్య భారత్ కీ జై" అను నవలకు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలగా బహుమతి అందించింది. ఇలా ఎన్నో రచనలు, నవలలకు బహుమతులు అందుకున్నారు. రేడియో నాటకం అనగానే "చిరంజీవి" పేరు గుర్తుకు వస్తుంది. వీరి నాటకాలు చాలా వరకు, భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి ప్రసారమైనవి. అంతర్జాతీయస్థాయిలో నిర్వహించే "ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాడ్ కాస్ట్ డెవలప్ మెంట్" అను సంస్థవారు, వీరు వ్రాసిన "ఆకలిమందు" నాటికను నమూనా రేడియో నాటికగా వాడుచున్నారు. వీరు 2014, సెప్టెంబరు-22న హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూసినారు.[5]