ఉప్పుమాగులూరు
ఉప్పుమాగులూరు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°04′30″N 80°02′42″E / 16.075°N 80.045°ECoordinates: 16°04′30″N 80°02′42″E / 16.075°N 80.045°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | బల్లికురవ మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,438 హె. (6,024 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 4,479 |
• సాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523301 ![]() |
ఉప్పుమాగులూరు, ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 301., ఎస్.టి.డి.కోడ్ = 08404.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
కొప్పెరపాలెం 5 కి.మీ, చవటపాలెం 5 కి.మీ, వేమవరం 6 కి.మీ, బల్లికురవ 6 కి.మీ, తంగెడుమల్లి 6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన మార్టూరు మండలం, పశ్చిమాన సంతమాగులూరు మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం, తూర్పున యద్దనపూడి మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాల ఆవరణలో 2017,జూన్-1న నందమూరి తారకరామారావు కళావేదిక నిర్మాణానికై భూమిపూజ నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ చిట్టిపోతు మస్తానయ్య, శ్రీ కక్కెర వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో ఈ కళావేదిక నిర్మించనున్నారు. [4]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
ఓగేరు వాగు:- ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో, ఓగేరువాగుపై 5,5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం 2012 నుండి నిర్మాణంలో ఉంది. ఈ చెక్ డ్యాం పూర్తి అయినచో, అక్కడ ఉన్న ఎత్తిపోతల పథకం నుండి మల్లాయపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, కోటావారిపాలెం, సోమవరప్పాడు గ్రామాల పరిధిలోని 2,174 ఎకరాలకు సాగునీరు అందుతుంది. [3]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అమర్నేని అంజనాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
- అయినాల మల్లేశ్వరరావు: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి గ్రహీత
- కొర్రపాటి జేమ్స్: సిలువధారి మొదలైన క్రైస్తవ నాటకాల రచయిత
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 4,479 - పురుషుల సంఖ్య 2,294 - స్త్రీల సంఖ్య 2,185 - గృహాల సంఖ్య 1,160; 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,431. ఇందులో పురుషుల సంఖ్య 2,276, మహిళల సంఖ్య 2,155, గ్రామంలో నివాస గృహాలు 1,150 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,438 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
- https://www.facebook.com/photo.php?fbid=1587319874633330&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,ఆగస్టు-8; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-4; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-2; 1వపేజీ.