అయినాల మల్లేశ్వరరావు
అయినాల మల్లేశ్వరరావు గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ‘సహజకవి’.[1] ఆయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత.[2]
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన ఏప్రిల్ 10 1955 న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఉప్పుమగులూరు గ్రామంలో జన్మించారు. ఆయన ఆంధ్ర, అన్నామలై విశ్వవిద్యాలయాలలో విద్యాభాసం చేసి తెలుగు, ఆంగ్ల భాషలందు ఎం.ఎ. చేసారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మూల్పూరులో పదవీవిరమణ చేసారు. ఆయన తెనాలి రామకృష్ణ అకాడమీకి వ్యవస్థాపక అధ్యక్షులు. శ్రీ అజంతా కళారామం సంస్థకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు.[3]
ఆసియా ఖండంలోని 464 మంది ప్రముఖులతో రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ ప్రచురించిన ‘ఎమరాల్డ్ హూ ఈజ్ హూ ఇన్ ఆసియా’ పుస్తకంలో ఆయనకు స్థానం లభించింది. ఉపాధ్యాయ వృత్తిలో జాతీయ అవార్డు అందుకున్న అయినాల, రచయితగానూ వాసికెక్కారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో పనిచేస్తున్నారు.[4]
రచనలు[మార్చు]
- లాల్ బహాదూర్ శాస్త్రి[5]
- పి.వి.నరసింహారావు[5]
- రాజీవ్ గాంధీ[5]
- సర్దార్ వల్లబాయి పటేల్[5]
- డా.సర్వేపల్లి రాధాకృష్ణన్[5]
మూలాలు[మార్చు]
- ↑ మేడే సందర్భంగా పాటల పోటీలు
- ↑ కెప్టెన్ విజరుప్రసాద్ జీవితం యువతకు స్ఫూర్తి
- ↑ inala malleswara rao[permanent dead link]
- ↑ ఆసియా ప్రముఖుల పుస్తకంలో ‘అయినాల’కు చోటు
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 "Ayinala Malleswara Rao". http://www.anandbooks.com/. Retrieved 30 January 2016.
{{cite web}}
: External link in
(help)|website=
ఇతర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు కవులు
- గుంటూరు జిల్లా కవులు
- ఆదర్శ ఉపాధ్యాయులు
- తెలుగు రచయితలు
- 1955 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- ఉత్తమ ఉపాధ్యాయులు
- గుంటూరు జిల్లా రచయితలు
- గుంటూరు జిల్లా ఉపాధ్యాయులు
- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు