Jump to content

కె. ఎస్. వరదాచార్య

వికీపీడియా నుండి
కె. ఎస్. వరదాచార్య
పండితరత్న కె.ఎస్. వరదాచార్య
పుట్టిన తేదీ, స్థలంఅక్టోబరు 23, 1922
కొత్తిమంగళ తమిళనాడు
మరణం2021
వృత్తిసంస్కృత పండితుడు, రచయిత
భాషసంస్కృతం
జాతీయతభారతీయుడు

కె.ఎస్. వరదాచార్యులు మైసూరు నగరానికి చెందిన ప్రముఖ సంస్కృత పండుతులు. వీరు పండితరత్న బిరుదాంకితులు.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు తమిళనాడు రాష్టృంలో 'కొత్తిమంగళా అనే గ్రామంలో 1922 అక్టొబరు 22 న జన్మించారు. చెన్నై, తిరుపతి వంటి నగరాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్య కొరకు మైసూరు నగరం వెళ్ళినారు. అటుపై మైసూరు నగరంలోనే వారి జీవనం కొనసాగించసాగారు. పరకాలమఠంలో శ్రీఅభినవ రంగనాధ స్వామి వారిని నిత్యం వీరు సేవిస్తూ ఉంటారు. సర్వ విద్యలు ఆయనను ఆశ్రయించుట వలనే లభించినవి అన్నది వీరి నమ్మకం. వీరు శ్రీ మహారాజా సంస్కృత కళాశాల యందు పనిచేసి, అక్కడే ప్రాచ్య విద్యాభివృద్ధి కోసం కృషిచేశారు. న్యాయశాస్త్రం యందు విశ్వవిఖ్యాతి గాంచిన జయంతి భట్టు రచించిన న్యాయమంజరి కి భాష్యం రచించి విద్వత్ లోకానికి కానుకగా ఇచ్చారు. ప్రౌఢదేవ రాయలు రచించిన బ్రహ్మసూత్రాలు కు వివరణ రచన చేసారు.నిరంతరం సేవాపరయణలు అయిన వరదాచార్యుల గృహం నిత్యం శిక్షక బృందంతో గురుకులంలా కనిపిస్తుంది. వందలమంది విద్యార్థులను వీరు సంస్కృత, ప్రాచీన విద్యలలో ప్రావీణ్యులుగా తీర్చి దిద్దారు. వీరు వశిష్టాద్వైత వేదాంతాన్ని దృఢపరిచారు. గుజరాత్, పలు ఇతర రాష్టృ విద్యార్థులకు బోధనం చేశారు. వీరు జీవితకాలం సరస్వతీ సేవా చేసి ఉన్నారు.

వరదాచార్యులు జీవితంలో సమన్వయం సాధించాలని ప్రబోధించేవారు. వేదాలు ప్రబోధించిన విరోధ భావాలను మనం నిత్య జీవితంలో పాటించకుండా జీవితాన్ని సమన్వయం చేసుకోవలంటారు వీరు. వీరు శ్రీరామకృష్ణ పరమహంసను, పుత్తూర్ శ్రీ శ్రీరంగమహాస్వామి సదా సేవించేవారు. సమన్వయ వరద వీరు రచించిన గ్రంథాలలూ బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథము. ఇందులూ సంస్కృతం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలలో వ్యాసాలు ఉన్నాయి. వీరు పూర్వపు సంస్కృత రచనలు కూడా ఇందులో ఉన్నాయి. వివిధ శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో విపులంగా వివరించబడినవి.

మూలాలు

[మార్చు]
  • సుధర్మ 2022 అక్టోబరు 22 దినపత్రిక వ్యాసం.