Jump to content

కిలారి ఆనంద్ పాల్

వికీపీడియా నుండి
(కె ఎ పాల్ నుండి దారిమార్పు చెందింది)
కిలారి ఆనంద్ పాల్
హైతీ లో కిలారి ఆనంద్ పాల్
జననం (1963-09-25) 1963 సెప్టెంబరు 25 (వయసు 61)
వృత్తిమత ప్రచారకుడు
రచయిత
వక్త
జీవిత భాగస్వామిమేరీ
పిల్లలుగ్రేస్, పీస్ , జాన్ పౌల్
తల్లిదండ్రులుబర్నబస్
సంతోషమ్మ

K A పాల్ (జ. 1963 సెప్టెంబరు 25) ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు, మత ప్రచారకుడు, శాంతి దూత, మానవతావాది. అతను యు.ఎస్ లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI), గోస్పెల్ టు ద అన్ రీచ్‌డ్ మిలియన్స్ (GUM) సంస్థల వ్యవస్థాపకుడు. అతను ఛారిటీ సిటీ తో పాటు అనేక అనాధ శరణాలయాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నాడు. [1] అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని టెక్సాస్లో ఇతడి నివసిస్తుంటాడు. భారత దేశానికి వచ్చినప్పుడు. హైదరాబాదులో సాధారణంగా బస చేస్తాడు.

బాల్యం, కుటుంబం

[మార్చు]

కిలారి ఆనంద పాల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విశాఖ జిల్లా చిట్టివలస అనీ గ్రామంలో బర్నదాస్, సంతోసమ్మ దంపతులకు 1963 సెప్టెంబరు 25న జన్మించాడు.[2][3][4] ఇతని తల్లిదండ్రులు మొదట హిందూ మతానికి చెందినవారు. తరువాత 1966లో క్రైస్తవ మతంలోకి మారారు. పాల్ మార్చి 1971లో తన ఎనిమిదవ యేట క్రైస్తవ మతంలోకి మారాడు. క్రైస్తవ మతంలో అతను ఇవాంజెలిస్టు ఫాదర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తన ప్రస్థానంలో భారతదేశంలోని అనేక గ్రామాలలో సువార్త లను ప్రబోధించాడు. తన 19వ యేట అతను పూర్తి స్థాయి క్రిస్టియన్ మినిస్ట్రీ లో చేరాడు.[5]

అతని భార్య మేరీ కిలారి. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.[6] అతని తల్లి 2019 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మరణించింది. [4]

క్రైస్తవ మత ప్రచారకుడు

[మార్చు]

డాక్టర్‌ కె.ఏ.పాల్‌ మంచి వక్త, తెలుగు, ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్‌ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు.[7] పాల్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయం.

విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన 10+2 (ఇంటర్) పూర్తి చేసాడు. అతను కెనడా లోని స్వాన్ రివర్, మానిటోబా లోని లివింగ్ వర్డ్ బైబిల్ కళాశాల నుండి గౌరవ డిగ్రీని పొందాడు.[8]

వృత్తి

[మార్చు]

”గ్లోబల్ పీస్ చారిటి” Boeing 747SP చారిట విమానంలో 148 దేశాల్లో తిరుగుచు ”గ్లోబల్ పీస్ చారిటి” ద్వారా క్రైస్తవ మతప్రచారం చేస్తున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

2008లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2009లో ఎక్కడా పోటీ చెయ్యలేదు.2014 లోనూ పోటీ చెయ్యలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు డెబ్బయి స్థానాల్లో పోటీ చేసినా అన్నిచోట్ల పాల్ తో సహా అందరు అభ్యర్థులు ధరవత్ (డిపాజిట్లు) కోల్పోయారు.[9][10]

వివాదాలు

[మార్చు]

పాల్ సోదరుని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న పాల్ అనుచరుడైన కోటేశ్వరరావును అపహరించి హత్య చేయాలన్న కుట్ర చేసారనే అభియోగంపై పాల్‌ను 2012 మే 21న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసారు.[11]

అతని మాటతీరు హాస్యంగాను నిజం కలిపి వివాదస్పదంగాను ఉంటాయి.[12]

తెలుగు సినిమా

[మార్చు]

కె. ఏ. పాల్‌ జీవితం ఆధారంగా యస్‌.బి. ఫిలింస్‌ పతాకంపై తిమోతి దర్శకుడిగా సంతోషమ్మ నిర్మించిన 'విశ్వవిజేత' అనే సినిమా తీసారు.[13]

మూలాలు

[మార్చు]
  1. ""The 8th wonder of the world K a Paul" in Oslo – NORWAY NEWS – latest news, breaking stories and comment – NORWAY NEWS". Archived from the original on 2022-11-08. Retrieved 2022-11-08.
  2. Sukumar, C. R. (22 May 2012). "Evangelist KA Paul arrested for murder conspiracy by Andhra Pradesh police". The Economic Times.
  3. "K.A. Paul's father condemns arrest". The Hindu. 25 May 2012 – via www.thehindu.com.
  4. 4.0 4.1 "KA Paul Bereaved". The Hans India. 12 February 2019.
  5. "Gospel to the Unreached Millions". ministrywatch.org. Archived from the original on 21 November 2003. Retrieved 16 September 2018.
  6. Dooley, Tara; Chronicle, Copyright 2005 Houston (29 January 2005). "Evangelist K.A. Paul moves spirits worldwide". Houston Chronicle.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. https://www.youtube.com/watch?v=Wma2VsqLVgE
  8. Sethurupan, Nadarajah (17 May 2004). ""Foreign Minister" in The New Republic". The New Republic.
  9. BBC News తెలుగు (24 May 2019). "కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  10. BBC Telugu (9 June 2024). "కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  11. "ఇవాంజెలిస్ట్ కె ఎ పాల్ అరెస్టెడ్ ఫర్ మర్డర్ కాన్స్పిరసీ బై ఆంధ్ర ప్రదేశ్ పోలీస్". 22 May 2012. Archived from the original on 21 మార్చి 2019. Retrieved 21 మార్చి 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. </
  13. [1][permanent dead link]

బయటి లింకులు

[మార్చు]