Jump to content

కేశాపురం (చిన్నమండెం)

అక్షాంశ రేఖాంశాలు: 13°53′48″N 78°39′55″E / 13.896642°N 78.665207°E / 13.896642; 78.665207
వికీపీడియా నుండి

కేశాపురం, వైఎస్ఆర్ జిల్లా చిన్నమండెం మండలానికి చెందిన గ్రామం.

కేశాపురం
—  రెవెన్యూ గ్రామం  —
కేశాపురం is located in Andhra Pradesh
కేశాపురం
కేశాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°53′48″N 78°39′55″E / 13.896642°N 78.665207°E / 13.896642; 78.665207
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం చిన్నమండెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516214
ఎస్.టి.డి కోడ్ 08561

శ్రీ పాలేటమ్మ తల్లి ఆలయం

[మార్చు]

కేశాపురం గ్రామం దేవళంపేటలో వెలసిన శ్రీ పాలేటమ్మ తిరునాళ్ళు నిర్వహించారు. ఈ గ్రామములో నెలకొనియున్న శ్రీ పాలేటమ్మ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి తరువాత వచ్చు విదియ, తదియలలో నిర్వహించెదరు. కోరిన వరాలిచ్చే తల్లిగా పేరెన్నికగన్న పాలేటమ్మకు చిన్నమండెం, కలిబండ, పడమటికోన, బోనమల, కేశాపురం, జిల్లా సరిహద్దు గ్రామాలలో పౌర్ణమి నుండియే, బోనాలు సమర్పించెదరు. విదియ రోజున ఉదయం నుండి, దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. సాయంత్రం సిద్దల బోనాలు సమర్పించడంతో, తిరునాళ్ళు ప్రారంభమగును. మొక్కులు ఉన్నవారు కట్టే చాందినీ బండ్లు రాత్రికి తిరుగుతవి. తదియరోజు తిరునాళ్ళు ఉండును. ఈ కార్యక్రమం కొరకు, ఆలయానికి రంగు లద్ది, విద్యుద్దీపాలతో అలంకరించెదరు. కడప - బెంగుళూరు జాతీయ రహదారిలో అమ్మవారిని దీపాలతో ఏర్పాటుచేస్తారు. ఈ తిరునాళ్ళకు జిల్లా నలుమూలల నుండియే గాక, చిత్తూరు, అనంతపురం సరిహద్దు మండలాల నుండి గూడా భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు.

మూలాలు

[మార్చు]