కైలే అనిల్ కుమార్

వికీపీడియా నుండి
(కైలే అనిల్‌ కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కైలే అనిల్‌ కుమార్‌

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు ఉప్పులేటి కల్పన
నియోజకవర్గం పామర్రు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 13 ఫిబ్రవరి 1977
అరండల్ పెట్, పామర్రు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కైలే సంజీవరావు, జ్ఞానమణి
జీవిత భాగస్వామి హేమలీన
సంతానం ఆరాధ్య

కైలే అనిల్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కైలే అనిల్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పామర్రు, , అరండల్ పెట్ లో కైలే సంజీవరావు, జ్ఞానమణి దంపతులకు జన్మించాడు. ఆయన ఎంసీఏ వరకు చదువుకున్నాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

కైలే అనిల్‌ కుమార్‌ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తల్లి కైలే జ్ఞానమణి వైఎస్సార్‌సీపీ తరపున బాపులపాడు మండలం జెడ్పీటీసీ సభ్యురాలిగా, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ఉంది. అనిల్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.

అనిల్‌ ను 2016లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిన తర్వాత వైసీపీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పై 30873 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2021-12-22.
  2. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (18 March 2019). "కృష్ణా జిల్లా ...వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Archived from the original on 21 మార్చి 2019. Retrieved 22 December 2021.
  4. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.