Jump to content

కైవారం బాలాంబ

వికీపీడియా నుండి

కైవారం బాలాంబ (1849 - 1944) ప్రముఖ అన్నదాత.[1]

కైవారం బాలాంబ ఫోటో

ఈమె 1849లో గుంటూరు జిల్లా, అంగలకుదురు గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి, వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే రామాయణం, భాగవతం వంటి పురాణ గ్రంథాల సారాన్ని గ్రహించారు. కైవారం సుబ్బన్న గారితో వివాహం జరిగి భర్తతో మంగళగిరి అత్తవారింటికి వచ్చారు. అనతికాలంలోనే భర్త మరణించారు. మంగళగిరి నరసింహస్వామిని ఉపాసించి దేవుని సేవలోనే శేషజీవితాన్ని గడిపారు. కొంతకాలం తపస్సు చేసి గ్రామంలో అన్నదానం ప్రారంభించారు. నిరాడంబరత, స్వపరభేదం లేని సమదృష్టి, ప్రశాంత చిత్తం వీరి వ్యక్తిత్వ లక్షణాలు. ఈమె మొదలుపెట్టిన అన్నదానం ప్రజల, దాతల ఆదరణకు నోచుకొని క్రమంగా విస్తృతమై వందలాది మంది భక్తులకు బాటసారులకు అన్నదానం చేసే స్థాయికి ఎదిగింది. మంగళగిరి తిరునాళ్ల సమయంలో వేలాది మంది యాత్రికులు వీరి సత్రంలో భోజనాలు చేసేవారు. 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు.

ఈమె 95 సంవత్సరాల వయసులో 1944 ఆగష్టు 12 తేదీన పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. కైవారం బాలాంబ (1849-1944), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 385-6.