కొండుభట్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కొండుభట్లపాలెం" గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన గ్రామం.

కొండుభట్లపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం బాపట్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522101
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అలివేలుమంగా పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములోని జె.పి.నగర్‌లో వెలసిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. [3]

శ్రీ కొండలమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయ పంచమ శిడిమాను ఉత్సవాలు, 2015, మే నెల 22వ తేదీ శుక్రవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు, వైభవంగా నిర్వహించారు. 24వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ, అనంతరం శిడిమాను ఉత్సవం నిర్వహించారు. విద్యుత్తు ప్రభలతో ప్రదర్శన నిర్వహించడం ఈ ఉత్సవాలలో విశేషం. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

బాపట్ల మండల పరిధిలోని కొండుభట్ల పాలేనికి చెందిన శ్రీ జి.కె.నాయుడు, విజయనిర్మల దంపతుల కుమార్తె అయిన సౌజన్య, కొత్త ఢిల్లీలోని ఐ.ఐ.టి.లో ఇ.సి.ఇ. విభాగంలో, ఆఖరి సంవత్సరం బి.టెక్ చదువుచున్నది. ఈమె ఇటీవల గేట్ (Graduate Aptitude Test in Engineering) ప్రవేశ పరీక్ష వ్రాసినది. 2015, మార్చి-12వ తేదీనాడు వెల్లడించిన ఆ పరీక్షా ఫలితాలలో ఈమె జాతీయస్థాయిలో 110వ రాంకు సాధించింది.