Jump to content

కొత్త కాపురం

వికీపీడియా నుండి
(కొత్తకాపురం నుండి దారిమార్పు చెందింది)
కొత్త కాపురం
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాతజి. వెంకటరత్నం
తారాగణంకృష్ణ,
భారతి
సంగీతంకె. వి. మహదేవన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఏప్రిల్ 18, 1975 (1975-04-18)
భాషతెలుగు

కొత్త కాపురం పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1975లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, భారతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను జి. వెంకటరత్నం ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు.[1] పల్లెటూరి వాతావరణాన్ని, పల్లె ప్రజల జీవన విధానాన్ని, వారి కుటుంబాల్ని, అందులోని తగదాల్ని ప్రధానంగా ఆవిష్కరించిందీచిత్రం.

తారాగణం

[మార్చు]


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి.చంద్రశేఖర్ రెడ్డి

సంగీతం: కె.వి.మహదేవన్

నిర్మాత: జి.వెంకటరత్నం

నిర్మాణ సంస్థ:ప్రసన్నలక్ష్మి పిక్చర్స్

సాహిత్యం:కొసరాజు,దాశరథి, సి. నారాయణ రెడ్డి, మోదుకూరి జాన్సన్

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి

విడుదల:18:08:1975 .

నిర్మాణం

[మార్చు]

దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[3]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు.[4]

  • కాపురం కొత్త కాపురం - ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ముంతంత కొప్పులో మూడు సేమంతి పూలు , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • కాడి జోడెడ్ల అవడా కరుకైన కుర్రవాడా , రచన: మోదుకూరి జాన్సన్, గానం. పులపాక సుశీల
  • దంచుకో నాయనా ధనియాల పప్పు , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓ రంగుల రామచిలుక ఇటురావే బంగారు , రచన:కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

[మార్చు]
  1. "కృష్ణ 'కొత్త కాపురం' చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి". Retrieved 2020-07-26.
  2. Chauhan, Ramesh (2016-11-23). "అభినవ భారతి..." Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 2020-07-27. Retrieved 2020-07-26.
  3. "నువ్వు పొట్టిగా వున్నావ్ .. యాక్టర్ ఎలా అవుతావ్ అన్నాడాయన: దర్శకుడు పీఎన్ రామచంద్రరావు ." ap7am.com. Archived from the original on 2020-07-26. Retrieved 2020-07-26.
  4. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews:". rajamusicbank.com. Retrieved 2020-07-26.