కాపురం కొత్త కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింగిరెడ్డి నారాయణరెడ్డి

కాపురం కొత్త కాపురం పాట కొత్త కాపురం (1975) సినిమా లోనిది. ఈ యుగళ గీతాన్ని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కలిసి గానం చేశారు. ఈ పాట ప్రేమ గీతం. ఈ పాటలో ఘట్టమనేని కృష్ణ, బారతి నటించారు. ఈ పాటను సి.నారాయణ రెడ్డి రచించగా, కె.వి,మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]

పాట[మార్చు]

పల్లవి:
కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం | | కాపురం | |

చరణం 1:

పాకలో ఉన్నా అది పసిడి మేడగా
మండుటెండలో ఉన్నా మల్లెల నీడగా
ఉన్నంతలో చెప్పలేని తీపిని అందించేది
గోరంతలో కొండంట తృప్తిని కలిగించేదే | | కాపురం | |

చరణం 2:

తన పతియే కనిపించే దైవమని
తన సతియే ఫలియించిన పుణ్యమని
ఒకరినొకరు తెలుసుకొని ఒకటిగా నడచుకొని
బ్రతుకంతా పచ్చదనం పండించుకొనేదే | | కాపురం | |

చరణం 3:

చీకటిలో చిరునవ్వులు వెలిగించుకొని
బాధలలో ఆనందం పంచుకొని
కలిమిలో పొంగక లేమిలో కృంగక
వెలుగు నీడలొక్కటిగా | | కాపురం | |

మూలాలు[మార్చు]

  1. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews:". rajamusicbank.com. Retrieved 2020-08-24.