కొత్తకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్తకోట, తెలంగాణ రాష్ట్రములోని వనపర్తి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము.

కొత్తకోట
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో కొత్తకోట మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో కొత్తకోట మండలం యొక్క స్థానము
కొత్తకోట is located in Telangana
కొత్తకోట
కొత్తకోట
తెలంగాణ పటములో కొత్తకోట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°22′00″N 77°58′00″E / 16.3667°N 77.9667°E / 16.3667; 77.9667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము కొత్తకోట
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 79,604
 - పురుషులు 40,366
 - స్త్రీలు 39,238
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.04%
 - పురుషులు 58.74%
 - స్త్రీలు 32.93%
పిన్ కోడ్ 509381

భౌగోళిక స్థితి[మార్చు]

బస్సు నిలయం, కొత్తకోట

ఇది 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. రవాణా వసతులు మంచి సౌకర్యాన్ని కలిగిఉన్నాయి. దగ్గరిలోని రైల్వే స్టేషను మదనంతపురం (లేదా వనపర్తి రోడ్). ఈ రైల్వే స్టేషను నిజాం కొడుకు కాలంలో ప్రారంభమైనది. చాలామంది ఎక్కుతారు. వనపర్తి నుండి రోజూ మహబూబ్ నగర్, అప్ అండ్ డౌవ్ చేసే వారు చాలా మంది ఉంటారు.ఇది మండల కేంద్రమైన కలశపాడు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బద్వేలు నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

గ్రామ పంచాయతీ కార్యాలయం, కొత్తకోట

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 79,604 - పురుషులు 40,366 - స్త్రీలు 39,238.అక్షరాస్యుల సంఖ్య 39657.[1]

పట్టణ జనాభా 19054 కాగా గ్రామీణ జనాభా 60473.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామ కూడలి

విద్యాసంస్థలు[మార్చు]

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన: 1981-82)
  • నివేదిత జూనియర్ కళాశాల (స్థాపన: 1997-98)
  • గాయత్రి ప్రైవేటు జూనియర్ కళాశాల
  • కోకిల కోఆపరేటివ్ జూనియర్ కళాశాల.[1]

చరిత్ర[మార్చు]

కొత్తకోట గ్రామం నుంచి నిజాం కాలంలో హైదరాబాదు వరకూ ఒక ముఖ్యమైన బాట ఉండేది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ వివరాలు వ్రాశారు [2].

విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అనంత తేజోవిరాజితంగా కోటిలింగేశ్వరస్వామి విశిష్ట లింగాకృతిలో కొలువుదీరారు. కాశీక్షేత్రం నుండి తెప్పించిన శివలింగమూర్తిని శ్రీశైల మఠాధిపతి 2007 వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు.[1]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 

వెలుపలి లింకులు[మార్చు]

(1).(ఈనాడు జిల్లా 2013 సెప్టెంబరు 3. 15వ పేజీ.)

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్తకోట&oldid=2461303" నుండి వెలికితీశారు