కొత్తపాలెం(చినగంజాం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్తపాలెం(చినగంజాం)
గ్రామం
కొత్తపాలెం(చినగంజాం) is located in Andhra Pradesh
కొత్తపాలెం(చినగంజాం)
కొత్తపాలెం(చినగంజాం)
నిర్దేశాంకాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25Coordinates: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E / 15.7; 80.25 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచినగంజాము మండలం
మండలంచినగంజాము Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)523181 Edit this at Wikidata


కొత్తపాలెం, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం[1]. .

గ్రామ రాజకీయాలు[మార్చు]

1970 కి ముందు కొత్తపాలెం ప్రజలు చినగంజాం పంచాయతీ పరిధిలో ఒకటో వార్డులో ఓటర్లుగా ఉండేవారు. అప్పుడు ఆ వార్డు సభ్యునిగా సూరిబోయిన జంగంరెడ్డిని వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఆయన నీటిపారుదల శాఖలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయారు. 1970లో కొత్తపాలెం పంచాయతీ ఆవిర్భవించాక, గ్రామస్తుల అభ్యర్ధన మేరకు ఆయన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఎన్నికల బరిలో నిలబడి, గెల్చి, 1970 నుండి 1981 వరకూ సర్పంచిగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధిబాటలో నడిపారు. గ్రామంలోని 300 ఎకరాల ఉప్పు భూములలో నిరుపేద రైతులు ఉప్పు పండించుకుంటుంటే, వారందరికీ పట్టాలిప్పించారు. ఆరు సెంట్ల స్వంత భూమిని, ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చి, పాఠశాలకు భవనాన్ని నిర్మింపజేశారు. గ్రామంలో రోడ్లు వేయించారు. తరచూ తుపాన్లతో ఇబ్బందులు పడుచున్న, తీరం వెంట ఉన్న మత్యకారులకు, కొత్తపాలెం పరిధిలోని మార్కెట్ వద్ద "భాగ్య నగర్" పేరిట ఇళ్ళు కట్టించారు.[2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]