కొబ్బరినీరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A young coconut, ready to drink as sold in Singapore.

కొబ్బరి చెట్టుకు కాసిన యువ కొబ్బరికాయలలో నిల్వ ఉన్న స్వచ్ఛమైన ద్రవమును కొబ్బరి నీరు అంటారు. కొబ్బరి కాయలో కొబ్బరి బీజం తయారు కావడానికి సిద్ధమవుతున్న దశలో కొబ్బరినీరు ఎక్కువగా ఉంటుంది, ఈ దశలో ఉన్న కొబ్బరి కాయలోని నీరు మనిషికి బాగా ఉపయోగపడుతుంది. ఈ దశ దాటి అభివృద్ధి చెందుతున్న కొబ్బరికాయ లోపల వైపు కొబ్బరిపీచుకు అంటుకుని గట్టిగా కొబ్బరిచిప్ప తయారవుతుంది, నీరు రూపాంతరం చెందుతూ కొబ్బరి చిప్పకు లోపలి వైపున అంటుకుంటూ తెలుపు రంగుతో ఉన్న కొబ్బరి తయారవుతుంది.

ప్రపంచ కొబ్బరి దినోత్సవము[మార్చు]

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

విపణిలో[మార్చు]

కొబ్బరినీరు ఉన్న కొబ్బరికాయలు అన్ని ప్రాంతాలలో లభిస్తాయి. కొబ్బరినీరు ప్యాకెట్లలో మరియు సీసాలలో కూడా భద్రపరచినవి కొన్ని ప్ర్రాంతాలలో మార్కెట్లోకి వచ్చాయి.

కొబ్బరి చెట్టుపై కొబ్బరి బోండాలు
Nuts, coconut water
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 20 kcal   80 kJ
పిండిపదార్థాలు     3.71 g
- చక్కెరలు  2.61 g
- పీచుపదార్థాలు  1.1 g  
కొవ్వు పదార్థాలు0.2 g
మాంసకృత్తులు 0.72 g
నీరు94.99 g
విటమిన్ A  0 μg0%
థయామిన్ (విట. బి1)  0.03 mg  2%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.057 mg  4%
నియాసిన్ (విట. బి3)  0.08 mg  1%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)  0.043 mg 1%
విటమిన్ బి6  0.032 mg2%
ఫోలేట్ (Vit. B9)  3 μg 1%
విటమిన్ సి  2.4 mg4%
విటమిన్ ఇ  0 mg0%
విటమిన్ కె  0 μg0%
కాల్షియమ్  24 mg2%
ఇనుము  0.29 mg2%
మెగ్నీషియమ్  25 mg7% 
భాస్వరం  20 mg3%
పొటాషియం  250 mg  5%
జింకు  0.1 mg1%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు