Jump to content

కొబ్బరి పీత

వికీపీడియా నుండి

కొబ్బరి పీత
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Superorder:
Order:
Suborder:
Infraorder:
Superfamily:
Family:
Genus:
Birgus
Species:
B. latro
Binomial name
Birgus latro
Coconut crabs occur on most coasts in the blue area
Synonyms

Burgus latro (lapsus)[మూలాన్ని నిర్థారించాలి]

కొబ్బరి పీత (ఆంగ్లం Coconut crab) ఒక రకమైన పీత. కొబ్బరిచెట్లపైన ఉంటూ కొబ్బరి కాయలకు రంధ్రాలుచేసి నీళ్ళుత్రాగే పీతలు రామేశ్వరం ప్రాంతంలో, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్నాయి. వీటిని కొబ్బరిచెట్టు పీతలు (Coconut Crabs) అంటారు. మామూలు పీతల్లాగా ఇవి సముద్రతీరంలో సంచరించవు. కొబ్బరి చెట్టు పీతలు, భూమిపైన, కొబ్బరి చెట్ల పైన ఉంటాయి. సమశీతోష్ణ ప్రదేశాల్లో, తీరద్వీపాల్లో, సముద్రతీరపు అడవుల్లో ఉంటాయి. తీరంలోని రాతిగుట్టల్లో, గుహల్లో గుడ్లుపెడతాయి. పెద్ద ఎండ్రి నాలుగు కిలోలు తూగుతుంది. తన గిట్టలతో 30 కిలోల బరువును ఎత్తగలదు. కొబ్బరి చెట్లను చకచకా ఎక్కేసి కాయలను తమ రాక్షసి గిట్టలతో చీల్చి తినేస్తుంది. పీతలప్రపంచంలో ఇది అతిపెద్దది. కాళ్ళు మీటరు పొడవు ఉంటాయి. వీటి పదిజతల కాళ్ళలో ముందుండే రెండు కాళ్ళు లేదా గిట్టలకు కత్తెర వంటి రెండేసి బలమయిన కొండెలుంటాయి. వాటితో పచ్చి కొబ్బరి కాయను తొలిచి లోపలి గుజ్జును తినేస్తుంది. కొబ్బరిచెట్లు పెరిగే సముద్రప్రాంతంలో ఇవి జీవిస్తాయి. ఒక్కోటి ఆరడుగుల పొడవు, 17కిలోల వరకు బరువుంటాయి. దీన్ని ఇంగ్లిషులో robber crab (దొంగపీత) అని కూడా అంటారు. తీరంవద్ద ఉన్న ఇళ్ళల్లో దూరి చిన్న చిన్న వస్తువులను కన్నంలో దాచుకొంటుంది.[1]

కొబ్బరిచెట్టు పీతలు రాత్రులు మాత్రమే సంచరిస్తాయి. ఇతర ఫలాలు, విత్తనాలు, చిన్న జీవులను ఆహారంగా భుజిస్తాయి. ఈ పీతలు సముద్రంలో గుడ్లు పెడతాయి. గుడ్లు లార్వాలుగా మారిన తర్వాత నీటి అడుక్కుచేరి వేరు జీవుల గుల్లల్లో తిస్టవేస్తాయి. కొంత ఎదిగాక, ఆ జంతువు గుల్లనువిడిచి మరింత పెద్ద జంతువుల గుల్లల్లో చేరతాయి. ఒకదశలో మొప్పలు ఊపిరితిత్తులుగా పనిచేయడంతో నీళ్ళ నుంచి వెలికివస్తాయి. భుమిమీదికి వచ్చాక, కొబ్బరిచిప్పలను మోసుకొంటూ కొన్నాళ్ళు సంచరిస్తాయి. శరీరం గట్టిపడిన తర్వాత యధేచ్చగా సంచరిస్తాయి. కేవలం కొబ్బరి గుజ్జునేకాక, పళ్ళు, ఆకులూ, సముద్ర జీవులను భుజిస్తాయి. కొన్ని ప్రాంతాలలో ప్రజలు వీటిని తింటారు కనక ఈ జాతి ఎండ్రిలు అంతరించే స్థితి ఏర్పడింది. ఇవి 60 యేళ్ళు జీవిస్తాయని, అంతకాలం జీవించడానికి పరిస్థితి అనుకులంగాలేదు.[2]


మూలాలు

[మార్చు]
  1. Raman, -Spoorthy (2023-05-13). "Coconut crabs and their colossal claws". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2023-05-15.
  2. Jirik, Kate. "LibGuides: Coconut Crab (Birgus latro) Fact Sheet: Summary". ielc.libguides.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-15.