కొమిరెడ్డి జ్యోతి
కొమిరెడ్డి జ్యోతి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | చెన్నమనేని విద్యాసాగర్ రావు | ||
---|---|---|---|
తరువాత | తుమ్మల వెంకట రమణారెడ్డి | ||
నియోజకవర్గం | మెట్‌పల్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1954 వెంకటరావుపేట్ గ్రామం, మెట్‌పల్లి మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
మరణం | 2024 నవంబరు 8 మెట్‌పల్లి | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కొమిరెడ్డి రాములు[1] | ||
సంతానం | కొమిరెడ్డి కరంచంద్, విజయ్‌అజాద్, కపిల్[2] | ||
నివాసం | మెట్‌పల్లి |
కొమిరెడ్డి జ్యోతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1998 లో మెట్‌పల్లి నియోజకవర్గానికి (ప్రస్తుత కోరుట్ల) జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]కొమిరెడ్డి జ్యోతి తన భర్త కొమిరెడ్డి రాములు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1994లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట్ ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీగా పని చేసింది. ఆమె 1994లో మెట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998 లో ఎంపీగా గెలవడంతో అయన ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[3]
కొమిరెడ్డి జ్యోతి కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో ఆందోళనలు చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుండి మన్ననలు అందుకొని ఆలిండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్ నాయకురాలిగా నియమితురాలైంది. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో ఆమె అనేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంది.
మరణం
[మార్చు]కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో బాధపడుతూ బెంగుళూరు లోని నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతూ 2024 నవంబరు 8న మరణించింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 April 2023). "డైనమిక్ లీడర్.. రామ్‌లు". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Andhrajyothy (21 November 2024). "కొమిరెడ్డి దంపతుల సేవలు మరువలేం". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.
- ↑ Eenadu (3 November 2023). "13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (9 November 2024). "మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతిదేవి మృతి". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ "మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!". 9 November 2024. Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.