కొలను భారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ఆంధ్ర ప్రదేశ్లో పేరుగాంచిన సరస్వతి దేవి దేవాలయం. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.

క్షేత్ర విశేషాలు[మార్చు]

ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉంది. ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చును. పరిసర ప్రాంతలు అత్యంత సుందరంగా ఉంటాయ్. ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం ఉంది. రాజుల కాలంలో నిర్మించిన ఐదు శివాలయాలు శిథిలావస్థలో మనకు దర్శనమిస్తాయి. దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమలలో వెలసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

  1. కర్నూలు జిల్లాలోని కొత్త పల్లె మండలములో శ్రీ కొలను భారతీ దేవి అమ్మవారు ఉన్నారు.
  2. నల్లమల కొండలలో "చారు ఘోషిణీ నది ఒడ్డున" వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి.
  3. ఇచ్చట, "శ్రీ చక్ర సంచారిణీ"యంత్రములో ' కొలను భారతి' ప్రతిష్ఠించ బడి ఉన్నారు,
  4. ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను.
  5. శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ' కొలను భారతీ అమ్మ వారు', చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి".గా కాన పడుతుంది
  6. కొత్త పల్లె మండల కేంద్రము నుండి 15 కిలో మీటర్ల దూరములో "శివ పురము" (వరకు వేసి ఉన్న "తారు రోడ్డు) గ్రామాన్ని చేరి : అక్కడినుండి 5 కిలో మీటర్లు (మెటల్ రోడ్) ప్రయాణించి, "కొలను భారతి కోవెలలను" భక్తులు దర్శించు కొంటారు

సరస్వతి ద్వాదశా నామాలు[మార్చు]

శ్రీ భారతి, సరస్వతి, శారదా దేవి, హంసవాహిని, జగద్విఖ్యాతి, వాగేశ్వరి, కౌమారి, బ్రహ్మచారి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్ర ఘంట, భువనేశ్వరి

ఆలయనామం[మార్చు]

కొలను ప్రక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థ ము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైంది .

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]