Jump to content

కొవ్వొత్తి

వికీపీడియా నుండి
జపాన్ లోని ఇబరాకిలో కొవ్వొత్తులు
వెలుగుతున్న కొవ్వొత్తి.
The motion of a candle flame shot with slow shutter speed and large aperture.
Candle flame with zones marked
Bees wax candles from the alemannic de (grave field of Oberflacht), Germany dating to 6th/7th century A.D. The oldest surviving bees wax candles north of the Alps.

మైనముతో చేసిన దీపాన్ని కొవ్వొత్తి అంటారు. దీనిని వెలిగించినపుడు మైనము కరుగుతూ, దీనికి అమర్చిన వొత్తి మండడం ద్వారా వెలుగుని ప్రసరింపచేస్తుంది.

పనిచేసే విధానం

[మార్చు]

కొవ్వొత్తి కాలడానికి, దాని ఒత్తిని వెలిగించాలి. ఇది కొద్ది మొత్తంలో ఇంధనాన్ని (మైనాన్ని) కరిగించి ఆవిరి చేస్తుంది . ఆవిరైన ఇంధనం వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసి మండుతూ స్థిరమైన మంటను ఇస్తుంది. ఈ మంట కొవ్వొత్తిని స్వయం నిరంతర సంఘటనల ద్వారా కాల్చడానికి తగిన వేడిని అందిస్తుంది: మంట లోని వేడి ఘన ఇంధనపు పైభాగాన్ని కరిగిస్తుంది. ద్రవీకృత ఇంధనం అప్పుడు కేశనాళిక చర్య (కాపిల్లరీ యాక్షన్) ద్వారా ఒత్తిలో పైకి కదులుతుంది; ద్రవీకృత ఇంధనం చివరకు కొవ్వొత్తి అవిరై, కొవ్వొత్తి మంటలో కాలిపోతుంది ఇంధనం (మైనపు) కరిగి, కాలుతూ పోవడంతో, కొవ్వొత్తి చిన్నదై పోతూ ఉంటుంది.. ఆవిరి ఇంధనాన్ని విడుదల చేయని ఒత్తి పైభాగం మంటలో కాలిపోతుంది. ఒత్తి ఇలా కాలి భస్మమై పోవడంతో ఒత్తి పొడవు పరిమితమై పోతూ ఉంటుంది. తద్వారా జ్వలన ఉష్ణోగ్రత, ఇంధన వినియోగం రేటు స్థిరంగా ఉంటాయి. కొన్ని ఒత్తులను కత్తెరతో కత్తిరిస్తూ ఉండాలి. ఆధునిక కొవ్వొత్తులలో, ఒత్తి కాలిపోతూండగా అది వంకర తిరిగి పోతూ ఉంటుంది. దీని వలన ఒత్తి కొనకు ఆక్సిజన్‌ను అందుతుంది. అగ్నిలో అది దగ్ధమై పోతుంది.దీన్ని స్వయంగా-కత్తిరించే ఒత్తి అంటారు. [1]

తయారీ

[మార్చు]

కొవ్వొత్తుల తయారీ ఒక కుటీర పరిశ్రమగా పెట్టుకోవచ్చు. ఇళ్ళలో కూడా వీటిని తయారుచేయవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. European Candle Association FAQ Archived 2012-01-13 at the Wayback Machine.