జ్వాల

జ్వాల లేదా జ్యోతి (Flame) దీపం లేదా అగ్ని నుండి వెలువడే మంట. ఇది సాధారణంగా దృశ్య కాంతిని వెదజల్లే భాగంగా పేర్కొంటారు. భౌతికంగా జ్వాల నుండే వేడిమి పుడుతుంది.
జ్వాల యొక్క రంగు, ఉష్ణోగ్రతలు దానికి కారణమైన ఇంధనం మీద ఆధారపడిఉంటుంది. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు వత్తిలోని ఇంధనం మండి ఆవిరి అవుతుంది. ఈ స్థితిలో అది ఆమ్లజనితో చర్య వలన ఉష్ణం జనించి, మరికొంత ఇంధనం మండుతుంది. ఈ విధంగా ఇంధనం ఉండేటంత వరకు కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. జ్వాలలో జనించిన శక్తి కొన్ని ఎలక్ట్రాన్ లను ఉత్తేజ పరచి కాంతిని విడుదల చేస్తుంది.
ఆమ్లజని కాకుండా ఇతర మూలకాలు కూడా జ్వాలను కలిగించగలవు. హైడ్రోజన్ను క్లోరిన్లో మండించినప్పుడు వాయు రూపంలోని హైడ్రోజన్ క్లోరైడ్ (HCl) ఉత్పత్తి అవుతుంది.[1] రాకెట్ ఇంజన్ లో హైడ్రజిన్, నైట్రోజన్ టెట్రాక్సైడ్ ఇంధనంగా వాడుతారు.
జ్వాలలో చాలా రకాల క్లిష్టమైన చర్యలు జరుగుతాయి. ఉదాహరణకు సహజ వాయువు మండినప్పుడు సుమారు 53 జాతులు, 325 రకాల ప్రాథమిక చర్యలు జరుగుతాయని గుర్తించారు.[2]
జ్వాలా వర్ణం[మార్చు]

మూలాలు[మార్చు]
- ↑ "Reaction of Chlorine with Hydrogen". Archived from the original on 2008-08-20. Retrieved 2008-10-15.
- ↑ Gregory P. Smith; David M. Golden, Michael Frenklach, Nigel W. Moriarty, Boris Eiteneer, Mikhail Goldenberg, C. Thomas Bowman, Ronald K. Hanson, Soonho Song, William C. Gardiner, Jr., Vitali V. Lissianski, and Zhiwei Qin, GRI-Mech 3.0, archived from the original on 2007-10-29, retrieved 2008-10-15 CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)