Jump to content

కోంబడీ వడే

వికీపీడియా నుండి
కోంబడీ వడే
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంకొంకణం
వంటకం వివరాలు
వడ్డించే విధానంఅల్పాహారం
ప్రధానపదార్థాలు కోడికూర, వడ (బియ్యప్పిండి కానీ మరేదైనా పిండితో చేసినది), ఉల్లిపాయలు, నిమ్మరసం, సోలకఢీ (కొబ్బరి పాలతో చేసే పానీయం)

కోంబడీ వడే (कोंबडी वडे, అనువాదం: కోడి వడ, ఉచ్ఛారణ: కోంబ్డీ వడే) అనేది మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో వడను తినే ఒక పద్ధతి. ఇందులో వడని (మామూలుగా వడని బియ్యప్పిండితో చేస్తారు. కొంతమంది గోధుమ వడలూ, రాగి వడలు కూడా చేసుకుంటారు.) కోడికూరతో తింటారు. కూరతో పాటు ఉల్లిపాయలూ, నిమ్మరసం, సోలకఢీ (కొబ్బరిపాలతో చేసే ఒక పానీయం) కూడా తీసుకుంటారు. కొంకణ ప్రాంతంలోని రాయగఢ, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలలో ఈ వంటకాన్ని మరాఠీ పండగలైన గతహారి (దీప అమవాస్య), గౌరీ ఓవస, దేవ దీపావళీ, శిమగ సమయాలలో బాగా తింటారు. ముంబాయితో సహా మహారాష్ట్రా తీర ప్రాంతాలలో ఈ తినుబండారం ఏడాది పొడవునా దొరుకుతుంది.[1][2][3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mast Malvani, Kombdi Vade Dish, Chicken Recipes". Nicainstitute.com. Archived from the original on 18 జూలై 2015. Retrieved 11 సెప్టెంబరు 2015.
  2. "Kombdi Vade / Malvani Vade / Tandalache Vade – Maharashtrian Recipe". Maharashtrian Recipes Online. 2013-12-18. Retrieved 2015-09-11.
  3. Sawant, Purva (2013-08-02). "Food Funda: Kokani Vade (Kombadi Vade/Malwani Vade)". Purvasfoodfunda.blogspot.in. Retrieved 13 December 2024.