కోణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెండు రేఖాఖండాలు లేదా రెండు కిరణాలు ఒక ఉమ్మడి బిందువువద్ద కలసినప్పుడు ఒక కోణం ఏర్పడుతుంది.

కోణం అనగా రెండు రేఖలు ఒకదానితో మరొకటి కలిసిన మధ్య స్థలం. రెండు రేఖలు ఒక బిందువు వద్ద కలసినప్పుడు కోణం ఏర్పడుతుంది. ఈ రెండు రేఖలను కోణం యొక్క భూజాలు అంటారు. కోణమును ఆంగ్లంలో ఏంగిల్ (Angle) అంటారు. యూక్లిడియన్ జ్యామితిలో, కోణం అనేది రెండు కిరణాల ద్వారా ఏర్పడిన బొమ్మ, దీనిని కోణం యొక్క భుజాలు అని పిలుస్తారు, ఇది ఒక సాధారణ ముగింపు బిందువును పంచుకుంటుంది, దీనిని కోణం యొక్క శీర్షం అని పిలుస్తారు.[1]

కోణం యొక్క పరిమాణాన్ని కొలుచుటకు మనం డిగ్రీలను ఉపయోగిస్తాం. డిగ్రీ అనేది ఒక ప్రమాణిక ప్రమాణం. డిగ్రీలను '°' చిహ్నం చే సూచిస్తారు. ఒక డిగ్రీని 60 నిమిషాలుగా (1° = 60') విభజించవచ్చు, ఒక నిమిషాన్ని 60 సెకండ్లగా కూడా విభజించుకోవచ్చు. గణితంలో కోణాలను సాధారణంగా రేడియన్లలో కొలుస్తారు.

కోణాల యొక్క రకాలు[మార్చు]

లఘుకోణం అనేది 90° ల కన్నా తక్కువ ఉంటుంది. లంబకోణం లేదా సమకోణం అనేది 90° లకు సమానంగా ఉంటుంది. గురుకోణం అనేది 90° ల కన్నా ఎక్కువగా, 180° ల కన్నా తక్కువగా ఉండే ఒక కోణం. ఋజుకోణం లేదా సరళకోణం (ఋజురేఖ లేదా సరళరేఖ) అనేది 180° లకు సమానంగా ఉండే ఒక కోణం. పరావర్తనకోణం లేదా బృహత్కోణం అనేది 180° ల కన్నా ఎక్కువగా, 360° ల కన్నా తక్కువగా ఉండే ఒక కోణం.

వివిధ రకాల కోణాల యొక్క చిత్రమాలిక[మార్చు]

లంబకోణం (Right angle).
పరావర్తనకోణం (Reflex angle).
లఘుకోణం (Acute Angle) (a), గురుకోణం (obtuse Angle) (b),, ఋజుకోణం (straight Angle) (c).

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కోణం&oldid=3875591" నుండి వెలికితీశారు