కోరుకొండ సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారుకొండ సుబ్బారెడ్డి

కోరుకొండ సుబ్బారెడ్డి స్వాత్రంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను పశ్చిమ గోదావరి జిల్లాలో కొరుటూరు గ్రామానికి చెందినవాడు.[2] బుట్టాయి గూడెం నుండి పశ్చిమ గోదావరి జిల్లా యర్నగూడెం వరకు ఉన్న గిరిజన గ్రామాలకు జమీందారుగా ఉండేవాడు. అతనికి బ్రిటిష్ వారిపై ద్వేషం ఉండేది. బ్రిటిష్ వారికి తొత్తులుగా ఉన్న గిరిజనులపై కూడా దాడులు చేస్తూండేవాడు. 1857లో యావత్ భారతదేశంలో స్వాతంత్ర్యసమరం ప్రారంభమైనప్పుడు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటులు జరిగాయి. ఆ సమయంలో దక్షిణాదిలో గోదావరి నది దిగువ ప్రాంతంలో గల యర్నగూడెంలో ఆంగ్లేయులపై పెద్ద తిరుగుబాటు ప్రారంభించాడు. దాదాపు 30 నుండి 40 గ్రామాలలో స్వాతంత్ర్య సమరయోధులు విజయం సాధించారు. దీనికి నాయకత్వం వహించింది కారుకొండ సుబ్బారావు.[3]

అతను కొండరెడ్డి తెగకు చెందిన గిరిజనుడు. దాదాపు ఏడాది పాటు అతను విప్లవ పోరాటం చేసాడు. చివరికి బ్రిటిష్ వారు అతని పట్టించిన వారికి 2500 రూపాయలు బహుమతి ప్రకటించారు. గిరిజనులలో కొందరు అతనిని వెన్నుపోటు పొడిచి అతనితో పాటు విప్లవ వీరులను పట్టించారు. వారిని 1858 జూన్ 11 లో వారిని పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ పోలీసు అధికారి అప్పలరాజుతో కారుకొండ సుబ్బారావు "మరొక్క 10 మంది సైనికులు నా దగ్గర్ ఉండేటట్లయితే మిమ్మల్ని 6 నెలల పాటు గడ గడ లాడించే వాడిని." అని తెలిపాడు. అప్పుడు బ్రిటిష్ వారు నీవెందుకు ఈ పోరాటం చేస్తున్నావు? అని అడిగారు. "నా నాయకుడైన నానా సాహెబు పీష్వా ఆదేశాల మేరకు నేను ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడుతున్నాను." అని జవాబిచ్చాడు. తాను చెప్పిన జవాబు బ్రిటిష్ వారిని కుదిపేసింది. ఆ ప్రాంతం మినహా బయటి ప్రాంతాల గురించి తెలియని కారుకొండ సుబ్బారెడ్డికి కాన్పూర్ కేంద్రంగా, మీరట్ కేంద్రంగా పనిచేస్తున్న నానా సాహెబు పీష్వాతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయో తెలియక బ్రిటిష్ వారు కంగారు పడ్డారు. అతని నుండి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేసారు. కానీ అతను ఒక్క మాట కూడా చెప్పలేదు. అతను తాంతియ తోపే స్వాతంత్ర్య పోరాటానికి ప్రభావితుడైనట్లు తెలిపాడు.[2] చివరికి 1858 అక్టోబరు 7 న కోర్టు తీర్పు ప్రకారం అతనిని ఉరి తీసారు.[3] 8 మంది విప్లవకారులను అండమాన్ పంపించారు. 30 నుండి 35 మంది గిరిజన వీరుల్ని గుంటూరు దగ్గర ఉన్న జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 8 మంది స్వాతంత్ర్య సమరయోధులను ఉరి తీయడం జరిగింది. అందులో కొందరిని పోలవరంలో ఉరి తీసారు. కారుకొండ సుబ్బారెడ్డిని, అతని సన్నిహితుడైన్ కొర్ల సీతారామయ్యను బుట్టాయగూడెంలో ఉరితీయడం జరిగింది. 1903లో గోదావరికి వరదలు వచ్చి కొట్టుకుపోయే దాకా వారికి ఉరి తీసిన ఉరికంబం పోలవరం దగ్గర గోదావరి ఒడ్డున ఉండేది.

బ్రిటిషర్లు అక్కడితో ఆగక కారుకొండ సుబ్బారెడ్డి మృత దేహాన్ని చిన్న బోనులో పెట్టి ఆ బోనును రాజమండ్రి లోని కోట గుమ్మం ప్రాంతంలో ప్రజలందరూ చూసే విధంగా వ్రేలాడగట్టారు. దానిని ప్రజలు సుబ్బారెడ్డి సంచి అనేవారు. చాలాకాలం వరకు అతని అస్థిపంజరం అలా వ్రేలాడుతూనే ఉండేదట.

మూలాలు

[మార్చు]
  1. బళ్ల, సతీశ్. "కోరుకొండ సుబ్బారెడ్డి: ఈ ఆదివాసీ నాయకుడిని బ్రిటిషర్లు ఉరితీసి, రాజమండ్రి కోటగుమ్మం దగ్గర వేలాడదీశారా?". బీబీసీ తెలుగు. No. 11 ఆగస్టు 2022. Retrieved 13 October 2024.
  2. 2.0 2.1 "THE GODAVARI PRIMER AN ESSENTIAL GUIDE ON THE UTILIZATION OF THE GODAVARI WATERS AND RESOURCES" (PDF). Archived from the original (PDF) on 2019-10-29.
  3. 3.0 3.1 "1857 తిరుగుబాటు - ఆంధ్ర హైదరాబాదుల ప్రభావం" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లంకెలు

[మార్చు]