Jump to content

కోలాచలం శ్రీనివాసరావు (పుస్తకం)

వికీపీడియా నుండి

ప్రసిద్ధ నాటకకర్త, తెలుగు నాటకరంగంలో సాలప్రాంశువు ఐన కోలాచలం శ్రీనివాసరావు జీవిత చరిత్ర ఇది. దీనిని ఎస్. గంగప్ప రచించారు.

రచన నేపథ్యం

[మార్చు]

విషయ సంగ్రహం

[మార్చు]

కోలాచలం శ్రీనివాసరావు బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత, న్యాయవాది. చిన్న వయసులోనే తెలుగు, కన్నడ, సంస్కృత, ఆంగ్ల భాషలలో పట్టు సాధించాడు. 1876లో ఎఫ్.ఏ పరీక్ష రాసి నెగ్గాడు. తరువాత కొన్ని సంవత్సరాలు అనంతపురం జిల్లా గుత్తిలో రెవెన్యూ ఇన్స్పెక్టరుగా పనిచేశారు. 1881లో అనంతపుర మండలం డిప్యూటికలెక్టరు దగ్గర దివానుగా ఉద్యోగం చేశాడు. 1888లో జాతీయోద్యమ పిలుపునందుకొని ముందు చేస్తున్న ఉద్యోగం మానేసి రెండవతరగతి ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణుడై బళ్ళారిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అప్పటినుండి వారి సాహితీ వ్యాసంగం ఊపందుకుంది. వీరు వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం కృష్ణమాచార్యులు ప్రముఖులు. అలాంటి నేపథ్యంలో ప్రారంభించిన వారి నాటకరచన గొప్ప పేరు గడింపజేసింది.

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: