కోల్ బ్రిగ్స్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | 1997 ఆగస్టు 20 |
మూలం: Cricinfo, 19 February 2021 |
కోల్ బ్రిగ్స్ (జననం 1997, ఆగస్టు 20) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] ఇతను 2020–21 ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరపున 2021, ఫిబ్రవరి 19న తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2][3] ఇతని అరంగేట్రంలో, ఇతను 101 పరుగులు చేశాడు. సీన్ సోలియాతో కలిసి ఆక్లాండ్‌కు 226 పరుగులతో మొదటి వికెట్‌కు కొత్త భాగస్వామ్య రికార్డును నెలకొల్పాడు.[4] తరువాతి మ్యాచ్‌లో, ఇతను ఆక్లాండ్ తరపున 99 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. సోలియాతో కలిసి మరో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.[5] ఇతను 2020–21 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఆక్లాండ్ తరపున 2021, మార్చి 18న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[6] ఇతను 2021-22 పురుషుల సూపర్ స్మాష్‌లో ఆక్లాండ్ తరపున 2021, డిసెంబరు 17న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Cole Briggs". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
- ↑ "20th Match, Auckland, Feb 19 2021, The Ford Trophy". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
- ↑ "Briggs in line for ACES debut as Ford Trophy resumes". Auckland Cricket. Retrieved 19 February 2021.
- ↑ "Ford Trophy: Auckland's Cole Briggs scores century on debut in record-breaking partnership with Sean Solia". Stuff. Retrieved 19 February 2021.
- ↑ "Ford Trophy: Auckland debutant Cole Briggs' stunning start continues in another runfest". Stuff. Retrieved 21 February 2021.
- ↑ "17th Match, Invercargill, Mar 17 - 21 2021, Plunket Shield". ESPN Cricinfo. Retrieved 18 March 2021.
- ↑ "7th Match (N), Hamilton, Dec 17 2021, Super Smash". ESPN Cricinfo. Retrieved 17 December 2021.