క్యారెట్ (స్వచ్ఛత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇది 14 క్యారెట్లను కలిగివున్నదని చూపిస్తున్న చిన్నగడియారము యొక్క వెనుకవైపు అచ్చు చిత్రం.

క్యారెట్ (Carat) అనేది బంగారం మిశ్రమాలకు కొలత యొక్క ఒక యూనిట్. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం, స్వచ్ఛమైన బంగారంలో 99.9 శాతం బంగారం ఉంటుంది. ఈ సందర్భంలో, ఒక క్యారెట్ బంగారం అంటే మిశ్రమలోహంలో ఇరవై నాల్గవ భాగం బంగారం అని, మిగిలిన 23 భాగాలు ఇతర లోహాలు అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన బంగారం మృదువైనది, స్వచ్ఛమైన బంగారాన్ని అనేక ప్రయోజనాల కోసం నేరుగా ఉపయోగించలేము.