క్యూరియాసిటీ రోవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


క్యూరియాసిటీ
అంగారక ఉపరితలంపై గేల్ క్రేటర్ ప్రాంతంలో క్యూరియాసిటీ యొక్క స్వంత చిత్తరువు (అక్టోబర్ 31, 2012).
మిషన్ రకంమార్స్ రోవర్
ఆపరేటర్నాసా
అంతర్జాతీయ జట్టు
COSPAR ID2011-070A
మిషన్ వ్యవధి668 మార్టిన్ సోల్స్ (23 భూ నెలలు) ప్రాథమిక లక్ష్యం.
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడు
  • బోయింగ్
  • లాక్హీడ్ మార్టిన్
లాంచ్ ద్రవ్యరాశి900 కిలోలు[1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీNovember 26, 2011, 15:02:00 (2011-11-26UTC15:02Z) UTC[2][3][4]
రాకెట్అట్లాస్ V 541 (AV-028)
లాంచ్ సైట్కేప్ కానవెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషనుLC-41[5]
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థహెలియోసెంట్రిక్ (ట్రాన్స్ఫర్)
Mars రోవర్
అంతరిక్ష నౌక భాగంరోవర్
ల్యాండింగ్ తేదీఆగస్టు 6, 2012, 05:17:57 UTC అంతరిక్షవాహక ఈవెంట్ సమయం[2][6]
మార్స్ పై టైమ్ కీపింగ్ (MSD) 49269 05:53:28 ఐరీ మీన్ సమయం (AMT)
ల్యాండింగ్ సైట్ఎయోలిస్ పలూస్ ("బ్రాడ్బరీ లాండింగ్"[7]) గేల్ క్రేటర్ లో
(4°35′22″S 137°26′30″E / 4.5895°S 137.4417°E / -4.5895; 137.4417 (Bradbury Landing))[8][9]
 

క్యూరియాసిటీ అనగా ఒక కారు పరిమాణంలో ఉండే రోబోటిక్ రోవర్. ఇది నాసాకు చెందిన లాబొరేటరీ మిషన్‌లో భాగంగా అంగారక గ్రహంపై దిగి, గేల్ క్రేటర్ ప్రాంతాన్ని అన్వేషిస్తోంది. క్యూరియాసిటీ MSL అంతరిక్షనౌకలో అమెరికాలోని కేప్ కానవెరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషను నుండి 2011 నవంబరు 26 న 10:02 గంటల (EST) కు బయలుదేరి, అంగారక గ్రహంపై గేల్ క్రేటర్ ప్రాంతంలో ఎయోలిస్ పలూస్ పై 2012 ఆగస్టు 6 న 05:17 గంటల (UTC) కు దిగింది. 563,000,000 కిలోమీటర్ల (350,000,000 మైళ్ల) ప్రయాణం తర్వాత రోవర్, లక్ష్యిత స్థలం నుండి కేవలం 2.4 కిలోమీటర్ల (1.5 మైళ్లు) కంటే తక్కువ దూరంలో దిగింది.

రోవర్ యొక్క లక్ష్యాలు

[మార్చు]
  • అంగారకుని వాతావరణ శోధన
  • అంగారకగర్భం యొక్క పరిశోధన;
  • గేల్ క్రేటర్‌లో ఎంచుకున్న ప్రాంతాలలో నీటి లభ్యతను పరిశోధించడం.
  • అంగారకుడి చరిత్రలో ఎప్పుడైనా సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలమైన పర్యావరణ పరిస్థితులు ఉండేవా లేవా అన్న విషయాన్ని అంచనా వేయడం.
  • భవిష్యత్తులో మానవ నివాస అనుకూలతలపై అధ్యయనం చేయడం.

2014 జూన్ 24 న క్యూరియాసిటీ ఒక అంగారక సంవత్సరాన్ని (687 భూమి రోజులు) పూర్తి చేసింది. తరువాత అది ఒకప్పుడు అంగారకుడు సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలంగా ఉండేదని కనుగొన్నది[మూలాలు తెలుపవలెను]

ఇప్పటికే క్యూరియోసిటీ రోవర్ యొక్క చక్రాలు పాడైపోయాయి.

అయితే దానికంటే ముందు పంపించిన " ఒప్పి" రోవర్ ఇప్పటికి చక్కగా పనిచేస్తుంది.

జీవానికి కావలసిన పదార్దాలు వున్నాయని క్యూరియోసిటీ రోవర్ కనుగొన్నదని ఒక ఆర్టికల్ లో ప్రచురించారు . అయితే రేడియేషన్ ఎక్కువ అవ్వడంతో దాని కంప్యూటర్స్ కూడా పాడైపోయాయి దాంతో రోవర్ తన "బ్యాక్అప్ కంప్యూటర్స్" ని అమలుచేసుకున్నది.

ఈ రోవర్844 వందల కేజిల బరువును కలిగి ఉంటుంది అందులో 80కేజిల బరువు పరికరాలు మాత్రమే ఉంటాయి.

ఈ రోవర్ కి పేరు పెట్టడానికి 9,000వేల ప్రొపొసల్స్ వచ్చినా 6 వ తరగతి "క్లారా మా" అనే అమ్మాయి చెప్పిన " క్యూరియోసిటీ " పేరు పెట్టడం విశేషం.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; nasa అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NASA-Curiosity అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NASA-1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NASA-2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; oig report అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Amos, Jonathan (August 8, 2012). "Nasa's Curiosity rover lifts its navigation cameras". BBC News. Retrieved June 23, 2014.
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NASA-20120822 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; MSNBC-20120806 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; S&T-20120807 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు