క్రాంతి డ్రిల్‌మ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రాంతి డ్రిల్‌మ్యాన్
జననంపనికెర క్రాంతి
1990 జూన్ 30
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తివిన్యాస కారుడు
ప్రసిద్ధిమ్యాజిక్, డ్రిల్లింగ్ విన్యాసాలు
తండ్రిపనికెర సత్తయ్య
తల్లిపనికెర మల్లమ్మ

క్రాంతి డ్రిల్‌మ్యాన్ (ఆంగ్లం:Kranti Drillman)(జననం 1990 జూన్ 30) భారతదేశానికి చెందిన విన్యాస కారుడు, డ్రిల్‌మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఇతను పేరుగాంచాడు. ఇతని అసలు పేరు పనికెర క్రాంతి.[1]

జననం, విద్యాభ్యాసం[మార్చు]

క్రాంతి 1990 జూన్ 30న తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆడ్డగూడూరు లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు పనికెర సత్తయ్య, మల్లమ్మ. క్రాంతి అడ్డగూడూరు గ్రామంలో తన ప్రాథమిక విద్యనభ్యసించాడు, పక్క ఊరు శాలిగౌరారంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తన ఉన్నత చదువు పూర్తి చేసాడు. ఆ తరువాత సూర్యాపేటలోని వెన్నెల ప్రాథమిక విద్యా సంస్థల నుండి టిటిసి చదువు పూర్తి చేశాడు. మహర్షి డిగ్రీ కళాశాల నుండి బిఏ పట్టా పొందిన క్రాంతి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి మ్యాజిక్ లో డిప్లమా చేశాడు. తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి యోగలో ఎం.ఎస్.సి పట్టా పొందాడు.

కెరీర్[మార్చు]

క్రాంతి తాను ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తుండగా ఒక విన్యాస కారుడిగా ఎదగాలని సాధన మొదలు పెట్టాడు. ఆ తరువాత కళాశాలల్లో, వివిధ పోటీలలో అతి భయంకర విన్యాసాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇలా ప్రదర్శనల ద్వారా జనాదరణ పొందిన క్రాంతి వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో తన సాహసాలను ప్రదర్శించాడు.

క్రాంతి ప్రదర్శనలు ఇచ్చిన కార్యక్రామాలు[మార్చు]

  • ఇండియాస్ గాట్ ట్యాలెంట్
  • ఇండియా కా మస్త్ కలందర్ (సోనీ టీవీ)[2]
  • జీ సూపర్ ట్యాలెంట్ (తమిళ్)
  • ఉగ్రం ఉజ్వలం (మలయాళం)
  • ట్యాలెంటో ముచో ట్యాలెంటో (ఉత్తర అమెరికా)[3]
  • అదుర్స్ (ఈ టీవీ తెలుగు)
  • బిగ్ సెలెబ్రిటీ (తెలుగు)

మూలాలు[మార్చు]

  1. Feb 7, Ch Sushil Rao / TNN /; 2019; Ist, 23:25. "'Drillman of India' from Telangana invited for America's Got Talent | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-09-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "సోనీ టీవీ యూట్యూబ్". సోనీ టీవీ.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "అంతర్జాతీయ టివి షో".{{cite web}}: CS1 maint: url-status (link)