క్రిస్టియాన్ హైగెన్స్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Christiaan Huygens | |
---|---|
జననం | 14 April 1629 The Hague, Netherlands |
మరణం | 8 July 1695 (aged 66) Netherlands |
నివాసం | Netherlands, France |
జాతీయత | Dutch |
రంగములు | Physics Mathematics Astronomy Horology Science fiction |
వృత్తిసంస్థలు | Royal Society of London French Academy of Sciences |
చదువుకున్న సంస్థలు | University of Leiden College of Orange |
పరిశోధనా సలహాదారుడు(లు) | Frans van Schooten John Pell |
ప్రసిద్ధి | Titan Explanation Saturn's rings Centrifugal force Collision formulae Pendulum clock Huygens–Fresnel principle Wave theory Birefringence First theoretical physicist |
ప్రభావితం చేసినవారు | René Descartes Frans van Schooten Blaise Pascal Marin Mersenne |
ప్రభావితులు | Gottfried Wilhelm Leibniz Isaac Newton |
క్రిస్టియాన్ హైగెన్స్ ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచయిత. కాంతి తరంగాలు రూపంలో ఉంటుందని మొదట ప్రతిపాదించిన వ్యకి పేరు హోయిగన్. ఈ ఉచ్చారణ సరిగ్గా తెలియక రకరకాలుగా పలుకుతారు.
జీవిత విశేషాలు
[మార్చు]క్రిస్టియన్ హైగెన్స్ 1629 ఏప్రిల్ 14న నెదర్లాండ్స్ హేగ్ పట్టణంలో జన్మించారు.[1] సుజాన్నా, కానిస్టింటన్ హైగెన్స్ ఆయన తల్లిదండ్రులు.లేడెన్ విశ్వవిద్యాలయం, బ్రెడాలోని కాలేజ్ ఆఫ్ ఆరెంజ్‌లో గణితం, న్యాయశాస్త్రాలు అభ్యసించారు ఇతడు 1678 లో కాంతి ఒక తరంగం అని ప్రతిపాదించాడు.1695 జూలై 8న నెదర్లాండ్స్‌లో చనిపోయారు.
1663లో లండన్ నగరంలోని రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.1666లో ప్యారిస్‌కు చేరుకున్నారు. అక్కడ హైగెన్స్ ఫ్రెంచి అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడిగా ఎంపికయ్యారు.1655లో శనిగ్రహం చుట్టూ ఘన వలయం ఉందని ప్రకటించారు. శనిగ్రహం ఉపగ్రహంలో టైటన్ కనుక్కున్నాడు. మన చంద్రుణ్ణి మినహాయిస్తే ఇది సౌరకుంటుంబంలో కనుక్కోబడ్డ ఐదవ సహజ ఉపగ్రహం [2] లోలక గడియారాలు రూపొందించి 1657లో పేటెంట్ కూడా సాధించారు. లోలక డోలన కాలసూత్రం ని ఉత్పాదించారు. 1678లో కాంతి తరంగ రూపంలో ఈథర్ అనే యానకంలో ప్రయాణిస్తుందని ప్రకటించారు. 'హైగెన్స్- ఫ్రెస్నెల్' నియమం ప్రతిపాదించారు. హైగెన్స్ రాసిన 'ట్రీటైజ్ ఆఫ్ లైట్ (1690), హోరోలోజియం (1658) శాస్త్రగ్రంథాలు ఆయనకు గొప్ప ప్రఖ్యాతి ఆర్జించిపెట్టాయి. మొదటి పుస్తకంలో కాంతికి సంబంధించిన అంశాలు వివరిస్తే.. రెండో పుస్తకంలో లోలక గడియారాల తయారీకి సంబంధించిన విషయాలున్నాయి.
ఈనాడు వాడుకలో ఉన్న రేడియో, టెలివిజన్, లేజర్, ఇంటర్నెట్ సాధనాలకు కారణమయ్యే విద్యుదయస్కాంత తరంగ వినియోగాలకు మూలాధారమైన సిద్ధాంతాన్ని చెప్పిన శాస్త్రవేత్త.
కాంతి తరంగ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన వ్యక్తిగా ప్రాచుర్యం పొందినా ఈయన ఎన్నో రంగాల్లో మేటి పరిశోధనలు చేశాడు. గణిత, ఖగోళ, న్యాయ, భౌతిక, కాంతి శాస్త్రాల్లో ఎన్నో సిద్ధాంతాలు, సూత్రాలు ఆవిష్కరించడమే కాకుండా సైన్స్ ఫిక్షన్ రచయిత కూడా. లోలకపు గడియారం, శని ఉపగ్రహమైన టైటాన్, అపకేంద్ర బలం లాంటివెన్నో కనిపెట్టాడు.
నెదర్లాండ్స్ ముఖ్యపట్టణం హేగ్‌లో 1629 ఏప్రిల్ 14న పుట్టిన హ్యూజీన్స్ పదహారేళ్ల వరకూ ఇంటి వద్దనే ట్యూషన్ల సాయంతో చదువుకున్నాడు. ఆపై విశ్వవిద్యాలయాల్లో చేరి సైన్స్, గణిత, న్యాయ శాస్త్రాలు అభ్యసించాడు. తన 34వ ఏట ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నికైన ఈయన గెలిలియో ఉపయోగించిన లఘులోలకానికి మార్పులు చేసి కాలాన్ని కొలవడానికి ఉపయోగించే లోలకపు గడియారాన్ని కనుగొన్నాడు. ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ దిశగా ప్రయాణించేప్పుడు లోలకపు గడియారం చూపించే మార్పులకు కారణం భూమి పరిభ్రమణం వల్ల కలిగే అపకేంద్రక బలమేనని చెప్పాడు. అప్పటి టెలిస్కోపులో లోపాలను గమనించిన హ్యూజీన్స్ స్వయంగా కటకాలను తయారు చేసుకుని వాటితో శనిగ్రహం వలయాలను పరిశీలించాడు. దాని అతి పెద్ద ఉపగ్రహం టైటాన్‌ను కనిపెట్టాడు.
ఆయన ప్రతిపాదించిన 'కాంతి తరంగ సిద్ధాంతం' (wave theory of light) భౌతిక శాస్త్రాన్నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. నీటి తరంగాల్లా, ధ్వని తరంగాల్లా కాంతి, ఈథర్ అనే మాథ్యమంలో తరంగాల రూపంలో పయనిస్తుందని చెప్పిన ఈ సిద్ధాంతం కాంతి ధర్మాలైన పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం, ధ్రువీకరణాలన్నింటినీ వివరించగలిగింది. దీని ఆధారంగానే తర్వాత కాలంలో విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతానికి పునాది పడింది. హ్యూజీన్స్ రాసిన 'Treatise on Light'ఇప్పటికీ ప్రామాణిక గ్రంథమే.
అవార్డులు
[మార్చు]హైగెన్స్ గౌరవార్థం ఎన్నో సంస్థలకు ఆయన పేరు పెట్టారు. ఎంతోమంది చిత్రకారులు హైగెన్స్ చిత్రం గీశారు. 1950లో డచ్ ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం ఓ కరెన్సీనోట్ కూడా ముద్రించింది. అందులో ఆయనతోబాటు శనిగ్రహం చిత్రం కూడా ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2015-04-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-09. Retrieved 2015-04-04.