క్రోకిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక మాడల్ యొక్క క్రోకిస్

క్రోకిస్ (ఆంగ్లం: croquis) అనేది ఒక మనిషి (మాడల్) ను చూస్తూ కేవలం ప్రధానమైన అంశాలను నమోదు చేస్తూ వేగంగా వేయబడే ఒక స్కెచ్. [1] [2][3] సాధారణంగా మాడల్ (ఒక్కోమారు ఒకరి కంటే ఎక్కువ మాడల్స్) వివస్త్రలై ఉంటారు. కళాకారులు తమను వివిధ భంగిమలలో చిత్రీకరించేలా మాడళ్ళు త్వరితంగా తమ భంగిమలను మారుస్తూ ఉంటారు. ఒక్కో భంగిమ నిడివి పది నుండి ఇరవై నిముషాలు ఉంటుంది. [4] కొంత వ్యవధి తర్వాత భంగిమ మార్చే సౌలభ్యం ఉండటంతో మాడళ్ళు కూడా క్రోకిస్ లో అసౌకర్యానికి గురి కారు.[5] ఒకే చోట కుదురుగా ఉండ(లే)ని జీవాలను (ఉదా: కీటకాలు, జంతువులు, చిన్నపిల్లలు) చిత్రీకరించటానికి సైతం క్రోకిస్ చక్కగా ఉపయోగపడుతుంది. [5] ఫ్యాషన్ టెక్నాలజీ లో సృష్టించబోయే దుస్తులు మాడల్ ఒంటి పై ఎలా ఉంటాయి అని ఊహించటానికి క్రోకిస్ ను ఉపయోగిస్తారు. [5] క్రోకిస్ ను అలాగే వదిలి వేయవచ్చు, లేదా మరింత సొబగులను అద్ది ఒక పరిపూర్ణ చిత్రలేఖనంగా కూడా అభివృద్ధి చేయవచ్చు.[5]

వ్యుత్పత్తి[మార్చు]

ఫ్రెంచి లో క్రోకిస్ అనగా స్కెచ్ అని అర్థం.[5]

ఉపయోగాలు[మార్చు]

ఆకారాన్ని అధ్యయనం చేయటానికి క్రోకిస్ ఉపయోగపడుతుంది. క్రోకిస్ లో అధిక వివరాలు ఉండవు. పనిలో వేగం, అసంపూర్ణ నాణ్యత ఒక రకమైన శక్తి, తాజాదనం, జవసత్వాలను ఇస్తుంది. చెప్పుకోవటానికి క్రోకిస్ ఒక చిత్తు నమూనా అయినా, ఒక కోణం లో చూస్తే క్రోకిస్ ను కూడా సంపూర్ణ కళగా చెప్పుకోవచ్చు.[4]

  • కళాకారుడికి వివిధ కోణాలలో వివిధ భంగిమలను సాధన చేసే అవకాశం దొరుకుతుంది
  • మానవ శరీరం, శరీర నిర్మాణం పై కళాకారుడికి అవగాహన పెరుగుతుంది
  • తక్కువ సమయంలోనే, తక్కువ ఖర్చుతో పలు సాంకేతిక అంశాలు, పలు మాధ్యమాలతో ప్రయోగాలు చేసే అవకాశం దొరుకుతుంది
  • అనుభవం ఏ స్థాయిలో ఉన్నా, క్రోకిస్ అందరూ ఆనందిస్తారు
  • క్రోకిస్ ఎప్పటికప్పుడు క్రొత్త సవాలే!
  • పరిపూర్ణ ఏకాగ్రతను అలవాటు చేస్తుంది. సందేహాలకు, తీర్మానాలకు క్రోకిస్ లో తావు లేదు
  • స్కెచ్ సరిగా రాకపోయినా, క్రొత్తది మొదలు పెట్టవచ్చు
  • క్రోకిస్ వేయటం వలన అలుపు వచ్చినా ఆనందదాయకమే

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కొలిన్స్ లో క్రోకిస్ నిర్వచనం
  2. మెరియం వెబ్స్టర్ లో క్రోకిస్ నిర్వచనం
  3. ఫ్రీ డిక్షనరీ లో క్రోకిస్ నిర్వచనం
  4. 4.0 4.1 Gregg, Jay (23 November 2016). "What is a croquis? What are the functions and purposes of a croquis?". Quora. Retrieved 25 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. 5.0 5.1 5.2 5.3 5.4 "Croquis vs Sketch". askdifference.{{cite web}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=క్రోకిస్&oldid=3548488" నుండి వెలికితీశారు