స్కెచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్కెచ్ (ఆంగ్లం Sketch) ఎటువంటి పరికరాలు లేకుండా, కేవలం చేతిని ఉపయోగించి (freehand) వేగంగా గీయబడే అసంపూర్ణమైన ఒక చిత్రం. స్కెచ్ అనేక ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని గీయబడతాయి. ఒక చిత్రకారుడు చూచిన ఒక దృశ్యాన్ని నమోదు చేయటానికి గానీ, తర్వాత ఉపయోగపడేలా ఒక ఆలోచన/సిద్ధాంతాన్ని గానీ చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది.

స్కెచ్ యొక్క మాధ్యమం ఏదయినా కావచ్చును. కానీ సాధారణంగా గ్రాఫైట్, పెన్సిళ్ళు, చార్కోల్, పేస్టెళ్ళు వంటి వాటితో చిత్రీకరించే చిత్రాలను స్కెచ్ అని వ్యవహరిస్తారు. కలం, సిరా, బాల్ పాయింట్ పెన్ను, వాటర్ కలర్, తైలవర్ణ చిత్రాలతో కూడా స్కెచ్ లు వేస్తారు. వీటిని వాటర్ కలర్ స్కెచ్ లు అని, ఆయిల్ స్కెచ్ లు అని అంటారు. శిల్పకారులు త్రీ-డైమెన్షనల్ స్కెచ్ లను బంకమట్టి, ప్లాస్టిసీన్ లేదా మైనం పై మలచుకొంటారు.

అనువర్తనాలు[మార్చు]

స్కెచింగ్ సాధారణంగా లలిత కళల విద్యాభ్యాసం లో భాగాలు. స్కెచింగ్ ప్రక్రియలో కొద్ది నిముషాలకు ఒక మారు భంగిమలు మారుస్తూ ఉండే ఒక సజీవ మాడల్ (క్రాకిస్) ను చూస్తూ చిత్రీకరించటం జరుగుతుంది. ఇలా గీయబడిన స్కెచ్ ను ఆధారంగా చేసుకొని ఇతర మాధ్యమాలలో మరింత పరిపూర్ణమైన చిత్రీకరించటానికి ఉపయోగిస్తారు.

చిత్రమాలిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=స్కెచ్&oldid=1826486" నుండి వెలికితీశారు