చర్చ:స్కెచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్కెచ్ గురించి అంతర్జాలం లో సమాచారం లేమి[మార్చు]

అంతర్జాలం లో సెచ్క్ గురించి సమాచారం పెద్దగా లభించటం లేదు. కానీ చిత్రలేఖనానికి స్కెచ్ కూడా ఒక పునాది రాయి. కావున దీనిని మొలకస్థాయి వ్యాసంగా వదిలివేయటం నాకు రుచించటం లేదు.

ఆర్కైవ్స్ లో కొన్ని స్కెచింగ్ పై కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వీటిని చదవటం వలన ఈ వ్యాసాన్ని కొంత విస్తరించవచ్చు. ఇది ఒకే దెబ్బతో అయిపోయే వ్యాసం కాదు. సమయం పడుతుంది. కావున మొలకల తొలగింపు ఋతువు వంటి వాటి నుండి ఈ వ్యాసానికి మినహాయింపు ఇవ్వవలసిందిగా మనవి!

ధన్యవాదాలు - శశి (చర్చ) 12:25, 1 జూలై 2021 (UTC)

బ్రిటానికా మూలాలు - నకలు హక్కులు[మార్చు]

YesY సహాయం అందించబడింది

బ్రిటానికా మూలాలు వ్యాసాలలో ఆమోదయోగ్యమేనా? ఉదా: ఈ వ్యాసంలో అనువర్తనాలు సబ్ హెడ్ మొత్తం బ్రిటానికా నుండి తెచ్చినదే. ఇదే టెక్స్టు ఆంగ్లవికీ వ్యాసంలో మూలాలతో సహా ఉంచినా తొలగించారు. (బహుశా నకలు హక్కుల సమస్య అయ్యి ఉండవచ్చును.) అయితే స్కెచింగ్ లో హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్ అనే పద్ధతుల కోసం అంతర్జాలం లో వెదికితే (ఆంగ్ల వికీ లో సైతం వీటి గురించి సరైన మూలాలు లేవు కావున వెదకవలసి వచ్చింది) మరల బ్రిటానికా దర్శనమిచ్చింది. (https://www.britannica.com/art/hatching-drawing-technique).

కావున బ్రిటానికా మూలాలు వ్యాసాలలో ఉంచవచ్చునో లేదో తెలుపగలరు.

ధన్యవాదాలు - శశి (చర్చ) 14:56, 21 జూలై 2021 (UTC)

@Veera.sj గారు, బ్రిటానికా మూలాలను వాడవచ్చు. ఆ మూలంలో విషయం చాలా కొద్దిగా వున్నందున, అది మొత్తం వాడితే నకలుహక్కుల సమస్య ఏర్పడే అవకాశముంది. కావున దానిని బయటలింకులలో వుంచటం మంచిదని నా అభిప్రాయం. ఆర్కైవ్ లాంటిసైట్ లలో డ్రాయింగ్ కు సంబందించిన పుస్తకాలను మూలంగా వాడడం మెరుగుగా వుంటుంది. అర్జున (చర్చ) 07:16, 26 జూలై 2021 (UTC)
ధన్యవాదాలు @అర్జునగారు! - శశి (చర్చ) 07:59, 29 జూలై 2021 (UTC)

ఆర్కైవ్ పుస్తకాలలో చిత్రాలు కామన్స్ లో ఎక్కించటం/తెలుగు వ్యాసాలలో వాటిని వాడటం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఆర్కైవ్ లో ఉన్న పుస్తకాలలోని చిత్రాలను కామన్స్ లో ఎక్కించి తెలుగు వ్యాసాలలో వాడుకోవచ్చా? నకలు హక్కుల సమస్య లేదు కాబట్టి ఇది సమంజసమే అని భావిస్తున్నాను. ఇది సమంజసమే అయితే ఇటువంటి వ్యాసాలకు చాలా చక్కని చిత్రాలను చేర్చవచ్చు.

ఉదాహరణ: నిశ్చల అంశాల స్కెచ్ సబ్ హెడ్ లో కొలమానాలు ఎలా తీసుకోవాలో చూపేందుకు చొప్పించిన చిత్రం. - శశి (చర్చ) 08:16, 30 జూలై 2021 (UTC)

@Veera.sj గారు, ఆర్కైవ్ ఒక డిజిటల్ గ్రంథాలయంగా పనిచేస్తుంది, నకలుహక్కుల గురించి ఎటువంటి ధృవీకరణ చేయదు కనుక, మీరు పుస్తకానికి నకలుహక్కులు తీరిపోయినవని నిర్ధారించితేనే కామన్స్ లో ఎక్కించటానికి వీలవుతుంది. మీరు పేర్కొన్న పుస్తకం 1988 లో ముద్రితమైనందున, దాని నకలుహక్కులు అమలులో వున్నాయి. కావున కామన్స్ లో ఎక్కించుటకు తగినది కాదు. అర్జున (చర్చ) 06:15, 1 ఆగస్టు 2021 (UTC)