ఖంగరాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖంగరాట్లు భారతదేశంలో సూర్యవంశ రాజపుత్ర వంశస్థాపకులు.

ప్రారంభం[మార్చు]

1503 జనవరి 17 నుండ 1527 నవంబరు 4 వరకు రాజా మొదటి పృథ్వీరాజు సింగు కచవా రాజవంశం రాజధాని అమెరు నుండి పరిపాలించాడు. తరువాత ఇది జైపూరుకు తరలించబడింది. ఆయన వివిధ వంశాలకు చెందిన 9 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. మొత్తం 18 మంది కుమారులు, ముగ్గురు కుమార్తెలను కలిగి ఉన్నాడు. ఖానువా యుద్ధంలో శిశోడియా (గెహ్లోటు) రాజ్యం మేవారుకు చెందిన తన మామగారైన మహారాణా రాణా సంగకు మద్దతు ఇవ్వడం ద్వారా పృథ్వీరాజు కచ్చావా చరిత్రలో తనదైన ముద్ర వేశారు. 1527 లో జరిగిన ఈ యుద్ధంలో రాజపుత్ర సమాఖ్యను బాబరు ఓడించాడు. మొఘలు సామ్రాజ్యం స్థాపనకు దారితీసిన మూడు ముఖ్యమైన యుద్ధాలలో ఇది రెండవది. పృథ్వీ రాజు తన కుటుంబాన్ని అమరు లోని బారా కోత్రిసు (ప్రముఖుల గృహాలు) నిర్వహించడం ద్వారా తన రాజ్యాన్ని బలపరిచాడు. ఈ భవనాలు కచవా వంశానికి చెందిన 12 పితృస్వామ్య శాఖలు, జైపూరు అత్యున్నత కులీనులను రూపొందిస్తాయి. పృధ్విరాజు కుమారులలో ఆరవవాడు జగమలు డిగ్గి భూభాగం మీద ఆధిపత్యం ఇవ్వబడింది. సైనిక కళలలో కూడా నైపుణ్యం సాధించినప్పటికీ జగ్మలు వైనే పాట, సాహసకృత్యాలకు గొప్ప ప్రేమికుడిగా ఖ్యాతిని సంపాదించాడు. ఆయన తాత్కాలికంగా అమరుకోట (ఇప్పుడు సింధులోని ఉమరుకోట) లో స్థిరపడ్డాడు. అక్కడ ఆయన సోధి యువరాణి నేతా కున్వారిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఐదుగురు కుమారులు ఉన్నారు. జగ్మలు తన సాహసకృత్యాలను కొనసాగించగా పిల్లలను వారి తల్లి, తల్లి తరఫు తాత పహరు సింగు పెంచారు. జగ్మలు తన నుండి 1549 లో మరణించే వరకు కచవా మాతృభూమికి దూరంగా ఉన్నాడు.

ఖంగరు[మార్చు]

జగ్మలు మరణం తరువాత ఖంగరు సింగ్జీ తన తండ్రి చేసిన తప్పులకు ప్రతీకారం తీర్చుకోవడానికి చొరవ తీసుకున్నాడు. అంబరు రాజ్యంలోని వారి నిజమైన భూములతో తన కుటుంబాన్ని తిరిగి అనుసంధానించే చర్యను ప్రారంభించాడు. వారు సంభారు ప్రాంతానికి అవతలి వైపుకు వెళ్ళినసమయంలో వారు బోరాజ, జాబ్నర్ల భూమిని స్వాధీనం చేసుకుని పరిష్కరించని కుటుంబ పోరు రూపంలో వారి మొదటి ఘర్షణను ఎదుర్కొన్నారు. 1554 లో జరిగిన ఈ యుద్ధంలో ఖంగరు గెలిచినప్పటికీ ఆయన పోరాటంలో తన చిన్న సోదరుడు సారంగు డియోను కోల్పోయాడు. ఆయన ఙపకార్ధం సారంగు అని పిలువబడే మర్రి చెట్టు ఇప్పటికీ అక్కడికక్కడే ఉంది. 1555 లో ఖంగరు కల్కాను స్వాధీనం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఈ ప్రాంతం చివరి బలమైన కోట అయిన జాబ్నరును స్వాధీనం చేసుకోవడానికి ముందుకు కదిలాడు. యుద్ధభూమిలో ఆయన బలం బారా కోత్రిసులో ఆయన ప్రధాన వారసత్వం కారణంగా ఖాంగరు తన కుటుంబంలో గణించతగిన సైనికశక్తిగా పరిగణించబడ్డాడు.

1527 లో తన తాత రాజా పృధ్విరాజు మరణంతో ప్రారంభమైన అంబరు పాలన కోసం ఒక అధికార పోరాటంగా మారింది. పృధ్విరాజు తన రెండవ కొడుకు పురాణమలును తన వారసుడిగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఆయన బాలుడి తల్లి వైపు మొగ్గు చూపాడు. పురాణ్మలు 1534 లో యుద్ధంలో మరణించడంతో ఆయన స్వల్పకాల పాలన ముగియడంకాక అప్పటికే ఆయన కుటుంబం బలం దెబ్బతింది. ఈ అసాధారణ నియామకం అనేకమంది సోదరులు సింహాసనం కోసం పోరాడటానికి కారణమైంది. ఇది రాజ్యం ఐక్యతను బలహీనపరిచింది. తత్ఫలితంగా వెలుపలి నుండి ఆక్రమణను ఆహ్వానించింది. 1548 లో రాజా భర్మల్ అధికారం స్వీకరించి 1574 వరకు విజయవంతంగా సుదీర్ఘ పాలన కొనసాగించే వరకు అంతర్గత అధికార పోరాటాలు జరిగాయి. తన తమ్ముళ్ళ స్వల్పమైన సైనికశక్తితో ఆకలిదాహంతో ఉన్న బంధువులకు లేని పరిపక్వత, దౌత్యసామర్ధ్యం కలిగిన 50 సంవత్సరాల వయసులో అధికారపీఠం అధిష్ఠించాడు. 1542-1605 నుండి పాలించిన అక్బరు, మొఘలు చక్రవర్తులలో గొప్పవాడిగా పరిగణించబడ్డాడు. ఆయన దౌత్యపరమైన మత సహనం, రాజాస్థానంలో రాజపుత్రులకు అధికారం ఇవ్వడం వంటి గుణాలకు ప్రసిద్ది చెందాడు. ఖంగరు వ్యూహాత్మక విన్యాసాలు ఆయనకు అమరు రాజు భార్మలుతో సమానమైన గుర్తింపు, ఉన్నత హోదాను ఇచ్చాయి.

సామర్ధ్యం[మార్చు]

అమరు మొఘలు ఆధిపత్యానికి అనుగుణంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో బలమైన ఏకీకృత రాజపుత్ర రాజకీయ, సైనిక ఉనికిని కలిగిన పాలకుడిగా ఖంగరును గుర్తించారు. ఈ శక్తివంతమైన రాజకీయ ప్రవృత్తిని ఉపయోగించి బారా కోత్రిసు శక్తిని బలోపేతం చేయడం ప్రారంభించాడు. రాజా పురన్మలు కుమారుడు తన దాయాది అయిన సుజామలు విధేయతను మినహాయించి, ఆయన విజయవంతంగా పాలన కొనసాగించాడు. తన తండ్రి మరణించినప్పుడు చాలా పిన్నవయస్కుడుగా ఉన్న కారణంగా సుజామలు సింహాసనం అదిష్టించడం తిరస్కరించబడినందున సుజామలు ఖంగరు మీద అసహనంగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే మేవారు మొఘలు రాజప్రతినిధి అక్బరు చక్రవర్తి బావ మీర్జా ముహమ్మద్ సహ్రీఫ్-ఉద్-దిన్ హుస్సేనుతో పొత్తు పెట్టుకున్నాడు. ఏదేమైనా ఈ ప్రాంతం సంరక్షకుడిగా మీర్జా షరీఫ్-ఉద్-దిన్ ఇంపీరియలు శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు సంకేతాలను చూపిస్తున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే సుజామలు ప్రేరేరణతోజ్ మీర్జా షరీఫ్-ఉద్-దిన్ బారా కోత్రిసు కచావా ప్రజలకు వ్యతిరేకంగా నిరంకుశ పోరాటానికి నాయకత్వం వహించాడు. 1563 లో షరీఫ్-ఉద్-దిన్ ఖంగరుతో పాటు మరో ఇద్దరు కుమారులను స్వాధీనం చేసుకున్నాడు. షరీఫ్-ఉద్-దిన్ కచవా ప్రజలను లొంగదీసుకుంటూ ఖంగరును ఒక సంవత్సరం పాటు కఠినమైన బందిఖానాలో ఉంచాడు.

అదే సమయంలో అక్బరు యాత్రలో ఉన్న కారణంగా షరీఫ్-ఉద్-దిన్ కార్యకలాపాల గురించి ఆయనకు తెలియదు. కచ్చవా ప్రజలు అక్బరు నుండి ఎందుకు పారిపోయారో తెలియక అక్బరు అవాక్కయ్యాడు. తమ నాయకులను పట్టుకోవటానికి అక్బరు ఆదేశించారని వారు నమ్ముతున్నందుకు అమాయకులు. చివరకు అక్బరు వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆయన ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించి అమెరు లోని రాజా భార్మలుకు హామీ సందేశాన్ని పంపాడు. ఈ చర్య ద్వారా అక్బరు కచావాల వారసత్వం, పాలనను ధృవీకరించాడు. తన న్యాయస్థానంలో సంరక్షకులుగా వారి హోదాను పెంచాడు. ఈ రోజు వరకు ఆగ్రా-డిగ్గి-అజ్మీరు మార్గం గుండా ఉన్న మైలురాళ్ళు ఈ గందరగోళాన్ని పరిష్కరించేటప్పుడు చక్రవర్తి మకాం చేసిన ప్రదేశాలను సూచిస్తాయి.

ఖంగరు సాధనలు[మార్చు]

విడుదలైన తరువాత ఖంగరు రాజా భర్మలు ఢిల్లీలో లెఫ్టినెంటు అయ్యాడు. అక్కడ ఆయన మీర్జా ఇబ్రహం హుస్సేనుకు వ్యతిరేకంగా నగరం రక్షణలో గణనీయమైన శక్తిగా ఉన్నాడు. 1570 ల మధ్య నుండి శతాబ్దం చివరి వరకు అమరుకు చెందిన రాజా మాను సింగు ఆఫ్ఘను వాయవ్య సరిహద్దు, బెంగాలు, బీహారు, ఒరిస్సా, దక్కన్లనుండి రక్షించాడు. ఖంగరు గొప్ప సైనిక విజయాలు జరిగిన ప్రదేశం అయిన బెంగాలులో అమరు సాధించిన విజయాలు అమరుకు గొప్ప ఖ్యాతి, సంపదకు మూలంగా ఉన్నాయి. 1576 లో రాజా మాను సింగు కోసం చేసిన హల్దిఘాటు యుద్ధంలో ఖంగరు తనదైన ముద్ర వేశాడు. 1577 లో తిరుగుబాటు చేసిన బుండి దుడాకు వ్యతిరేకంగా పోరాడిన ఖంగరు వీరగాధ జాపదకథ ప్రచారంలో ఉంది. ఈ యుద్ధంలో ఖంగరు తన శత్రువు నుండి ఒక కెటిల్డ్రం, జెండాను లాక్కున్నాడు. తరువాత అక్బరు వాటిని ఖంగరుకు బహుమతిగా ఇచ్చాడు. ఈ చారిత్రాత్మక అవశేషాలు కుటుంబ వారసత్వ సంపదలో ఒక భాగంగా ఉన్నాయి.

వివాహాలు[మార్చు]

తన సమకాలీనులందరిలాగే ఖంగరు అనేక రాజకీయ వివాహ సంబంధాలు చేసుకున్నాడు. జైపూరులోని నరియానా మహలు లోని నాలుగు చాత్రిలు ఆయన భార్యల సతీసహగమనానికి సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన 13 మంది కుమారులలో 10 మంది గొప్ప యోధులు అయ్యారు. వారు వారి స్వంత రాచరిక రాజ్యాలను స్థాపించారు. ఆయన 1584 లో మరణించాడు. బెంగాలులో గాని లేదా చిత్తోరు సమీపంలోని పుర్మండల భూములలో గాని అక్బరు ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. కంగహ్వా- ఖంగారోటు వంశానికి మొదటి తండ్రిగా ఖంగరు గుర్తించబడ్డాడు. శాంతియుత కాలంలో తరచుగా జరిగే విధంగా తరువాతి శతాబ్దంలో నమోదు చేయబడిన చరిత్రలో ఖాంగారోట్ల గురించిన వివరణ అస్పష్టంగా ఉంటుంది. ఖంగరు ఎనిమిదవ కుమారుడు సఖుడికి చెందిన భాకరు సింగు ఈ నియమాన్ని కొనసాగించాడు. ఆయన పది మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఎనిమిది మంది కుమారులు ఉన్నారు.వీరు కొత్త రాచరిక రాజ్యాలను కూడా స్థాపించారు. భకరు సింగు మరణం 1633 లో ఆయన భార్యలలో ఒకరి సతీసహగమనం చేసుకున్నట్లు రికార్డుల ద్వారా గుర్తించబడింది. తిలోర్నాకు చెందిన ఆయన కుమారుడు ద్వారకాదాసు ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఈ ముగ్గురు కుమారులు, అజాబు సింగు సహా, రాచరిక రాజ్యాలను స్థాపించే కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించారు. అజాబు సింగు కుమారులు ఇద్దరు హరి సింగు, బిజాయి సింగు మహారాజా రాం సింగు, మహారాజా బిషను సింగు అమరు రాజసభలో, ఖంగరోటు వంశం కొనసాగింపు రికార్డులలో తమను తాము గుర్తించుకున్నారు.

సంతతి[మార్చు]

హరి సింగు 1630 లో జన్మించాడు. 1695 లో క్షత్రియుల యోధుని యుద్ధంలో ముందు వరుసలో మరణించాడు. కచావాలు ఆయనను "లాంబా పురాణ అశ్వంగా" గా గౌరవిస్తారు. ఆయన లాంబా, మాల్పురా చుట్టుపక్కల ఉన్న భూస్వామ్యాధిపతుల భూములకు బలమైన, తెలివైన సేనాధిపతి. ఖైబరు పాసు చుట్టూ ఆఫ్ఘను భూభాగంలో నిష్ణాతుడైన యోధుడుగా, సంరక్షకుడిగా కీలక పాత్ర పోషించాడు. సింహాసనం అధిరోహణకు ముందు, తరువాత అమరు యువరాజు బిషను సింగుకు రక్షకుడిగా ఉన్నాడు. అమరుతో తనకున్న బలమైన సంబంధాలతో హరి సింగు కూడా సామ్రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించాడు - మొఘలు సామ్రాజ్యం క్రింద రాజపుత్ర పాలకుల ఆధిపత్య కాలంలో రాజపుత్ర కులీనులకు ఇది చాలా అసాధారణమైనది. ఆయన గొప్ప సైనికుడు, నాయకుడు; అవినీతి మీద పోరాడి రాజా బిషను సింగు పాలన కొరకు పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించారు. మొఘలు సామ్రాజ్యం పట్ల గౌరవం ప్రదర్శించాడు. ఆయన ఖంగారోటు అధిరోహణను కొనసాగించడమే కాక, హరిసింగు గోట్సు పేరుతో ఉప-వంశంగా వ్యత్యాసంతో సత్కరించబడ్డాడు. కచ్చవా ఖంగారోట్సు గొప్ప పూర్వీకులు ప్రస్తుత కాలం వరకు నివసిస్తున్నారు. వారు డిగ్గిలో వారి వారసత్వ భూములను కొనసాగిస్తున్నారు. వారు రాయలు హౌస్ ఆఫ్ అమరుకు చెందిన కచావా వంశానికి చెందిన పన్నెండు బారా కోత్రిసులలో ఒకరైన వారు భీకర యోధులుగా, రక్షకులుగా గొప్ప చరిత్రను సృష్టించాడు. ఖంగారోట్లు భారతదేశంలోని రాజపుత్రుల అత్యంత సాహసోపేతమైన లక్షణాలను కలిగి ఉన్నారు; ధైర్యవంతులు, ధైర్యవంతులు, వీరోచితం కలిగినవారు, నమ్మకమైనవారు అయినప్పటికీ వారి విపరీత కోరికలకు సిగ్గుపడరు.

మూలాలు[మార్చు]

అదనపు అధ్యయనం[మార్చు]

  • Henige, David (2004). Princely states of India;A guide to chronology and rulers
"https://te.wikipedia.org/w/index.php?title=ఖంగరాటు&oldid=2908335" నుండి వెలికితీశారు