ఖగోళ భౌతికశాస్త్రం
ఖగోళ భౌతికశాస్త్రం (Astrophysics) భౌతిక, రసాయన శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ఖగోళ వస్తువులను, వాటి ధర్మాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.[1][2]
చరిత్ర
[మార్చు]ఖగోళ శాస్త్రం పురాతనమైనది. ఇది చాలాకాలం క్రితమే భూమి మీద వస్తువులను గురించి అధ్యయనం చేసే భూభౌతిక శాస్త్రం నుంచి వేరు చేయబడింది. అరిస్టాటిల్ ఊహించిన దాని ప్రకారం ఆకాశంలో కనిపించే వస్తువులు స్థిరమైన గోళాలుగా, సమగతిలో ఒక వలయాకార కక్ష్యలో తిరుగుతుంటాయి.[3][4] భూ ప్రపంచం మాత్రం వృద్ధి, క్షయానికి గురవుతూ సరళరేఖలో ఒక నిర్దేశిత లక్ష్యం వైపుగా కదులుతూ ఉంటుంది. కాబట్టి ఖగోళం, భూమి వేర్వేరు పదార్థాలతో నిర్మితమై ఉంటాయని ఊహించారు. ఖగోళ వస్తువులు అగ్నితో తయారైనవని ప్లేటో, ఈథర్ తో తయారైనవని అరిస్టాటిల్ భావించారు. 17వ శతాబ్దంలో గెలీలియో,[5] డెకార్ట్,[6] న్యూటన్[7] లాంటి శాస్త్రవేత్తలు మాత్రం, భూమి, ఖగోళ వస్తువులు రెండూ ఒకే రకమైన పదార్థంతో తయారై ఉంటాయని, ఒకేరకమైన సహజ నియమాలకు లోబడి ఉంటాయని ప్రతిపాదించారు.
మూలాలు
[మార్చు]- ↑ Maoz, Dan (2016). Astrophysics in a Nutshell. Princeton University Press. p. 272. ISBN 978-1400881178.
- ↑ "astrophysics". Merriam-Webster, Incorporated. Archived from the original on 10 June 2011. Retrieved 2011-05-22.
- ↑ Lloyd, G. E. R. (1968). Aristotle: The Growth and Structure of His Thought. Cambridge: Cambridge University Press. pp. 134–135. ISBN 978-0-521-09456-6.
- ↑ Cornford, Francis MacDonald (c. 1957) [1937]. Plato's Cosmology: The Timaeus of Plato translated, with a running commentary. Indianapolis: Bobbs Merrill Co. p. 118.
- ↑ Galilei, Galileo (1989), Van Helden, Albert (ed.), Sidereus Nuncius or The Sidereal Messenger, Chicago: University of Chicago Press, pp. 21, 47, ISBN 978-0-226-27903-9
- ↑ Edward Slowik (2013) [2005]. "Descartes' Physics". Stanford Encyclopedia of Philosophy. Retrieved 2015-07-18.
- ↑ Westfall, Richard S. (1983), Never at Rest: A Biography of Isaac Newton, Cambridge: Cambridge University Press (published 1980), pp. 731–732, ISBN 978-0-521-27435-7