Jump to content

ఖిమత్ రాయ్ గుప్త

వికీపీడియా నుండి
ఖిమత్ రాయ్ గుప్త

ఖిమత్ రాయ్ గుప్త(క్యూ.ఆర్.గుప్త, క్యూ.ఆర్.జి అని కూడా అంటారు ఆయనను.)[1] ప్రముఖ భారత వ్యాపారవేత్త, హావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్. ఈయన స్థాపించిన హేవెల్స్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ఖిమత్ భారత 100మంది ధనికుల్లో ఒకరు.[2] ఫోర్బ్స్ ప్రచురించిన ప్రపంచ బిలీనియర్లలో కూడా ఖిమత్ స్థానం సంపాదించారు.[3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఖిమత్ 1937లో అవిభిజిత పంజాబ్ లో జన్మించారు.[4] 1958లో పంజాబ్ లో చదువును మధ్యలో వదిలిపెట్టి ఢిల్లీ వెళ్ళిపోయారు  ఆయన. 10000 రూపాయల పెట్టుబడితో ఢిల్లీ లోని భగీరథ్ ప్లేస్ లో ఎలక్ట్రికల్  హోల్ సేల్ మార్కెట్ లో గుప్తజీ & కంపెనీ పేరుతో ఒక ఎలక్ట్రికల్  షాపు పెట్టుకున్నారు ఖిమత్.[5][6]

హేవెల్స్

[మార్చు]

1971లో, ఖిమత్ 7 లక్షలకు హేవెల్స్ బ్రాండ్ ను హవేలీ రామ్ గాంధీ నుండి కొన్నారు.[7][8] ప్రస్తుతం హేవెల్స్ 3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రప్రంచ 5వ అత్యున్నత ఎలక్ట్రికల్ బ్రాండ్ గా నిలిచింది.[9][10]

అవార్డులు

[మార్చు]
  • ఎంటర్పెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2013[11]

కుటుంబం

[మార్చు]

ఖిమత్ భార్య వినోద్. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. వీరి రెండవ కుమారుడు అనిల్ రాయ్ గుప్త ప్రస్తుతం హేవెల్స్ సంస్థకు ఛైర్మన్ గానూ, ఎండిగానూ వ్యవహరిస్తున్నారు.[12]

7 నవంబరు 2014లో గుండె పోటుతో 77వ ఏటన మరణించారు ఖిమత్.[13][14]

References

[మార్చు]
  1. "What's special about QRG Group's 70-year old Qimat Rai Gupta's daily meetings?". The Economic Times. Archived from the original on 2015-04-03. Retrieved 4 March 2015.
  2. "Qimat Rai Gupta - Richest Indian". Forbes. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 4 March 2015.
  3. "Qimat Rai Gupta's Old-World Leadership Powers Havells". Forbes. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 4 March 2015.
  4. "He discontinued his education, today owns $1 billion company: Havells CMD Qimat Rai Gupta". Daily Bhaskar. Retrieved 4 March 2015.
  5. "Lunch with Qimat Rai Gupta Chairman Havells Group". Business Standard. Retrieved 4 March 2015.
  6. "The unsung billionaire: Qimat Rai Gupta". Calgary Indians. Retrieved 4 March 2015.
  7. "The extraordinary story of an unsung billionaire". Business Standard. Retrieved 4 March 2015.
  8. "The Unsung Billionaire". Business Standard. Retrieved 4 March 2015.
  9. "Indian Fan Maker Enters Billionaire Ranks". Forbes. Retrieved 4 March 2015.
  10. "Havells's Qimat Rai Gupta becomes billionaire as stock rises to record". Live Mint. Retrieved 4 March 2015.
  11. "Entrepreneur of the Year Qimat Rai Gupta". EY. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 4 March 2015.
  12. "Change Of Guard At Havells - India's Leading Electrical Goods Company". Forbes. Retrieved 4 March 2015.
  13. "Qimat Rai Gupta, India's Leading Fan Maker, Dies". Forbes. Retrieved 4 March 2015.
  14. "Havells India Chairman Qimat Rai Gupta Dies at 77". NDTV. Retrieved 4 March 2015.