ఖుషి రవి
ఖుషీ రవి | |
---|---|
జననం | సుస్మిత రవి 1993 జనవరి 31 |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | ఎస్.ఎస్.ఎం.ఆర్.వి. కళాశాల |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాకేష్ |
పిల్లలు | ఒక కూతురు |
సుస్మిత రవి (జననం 1993 జనవరి 31) భారతీయ నటి. ప్రధానంగా కన్నడ భాషా చిత్రాలలో నటించే ఆమెను కుషీ రవి అని పిలుస్తారు. 2020లో, ఆమె దియా చిత్రంతో తెరంగేట్రం చేసింది.[1][2] కన్నడనాట విజయవంతమైన ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో విడుదల అయింది.[3]
2023 చివరికల్లా విడుదలకు సిద్దమైన పిండం సినిమాతో శ్రీరామ్ సరసన ఆమె తెలుగు చిత్రపరిశ్రమలోనూ అడుగుపెట్టనుంది.[4]
విద్యాభ్యాసం
[మార్చు]మాండ్య జిల్లాలోని మద్దూరుకు చెందిన రవి, శోభ దంపతులకు 1993 జనవరి 31న సుస్మిత రవి బెంగుళూరులో జన్మించింది. ఆమె ఎస్.ఎస్.ఎం.ఆర్.వి. కళాశాలలో బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[5]
కెరీర్
[మార్చు]ఆమె కన్నడ చిత్రం దియా (2020)తో కెరీర్ మొదలుపెట్టింది. ఇది ఘన విజయం సాధించడంతో మొదటి చిత్రంతోనే ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె భయానక చిత్రం స్పూకీ కాలేజ్, నక్షే చిత్రాలలో నటించింది. అయితే, ఈ రెండు చిత్రాలు విడదల ఆలస్యం అవడంతో,[6][7][8] ఆ సమయంలో, ఆమె పలు లఘు చిత్రాలు, తమిళంలో "అడిపోలి" అనే సింగిల్ లలో నటించింది, వీటితో ఆమెకు మంచి ఆదరణ లభించింది.[9][10] స్పూకీ కాలేజ్ 2023లో విడుదలైంది.[11]
పురస్కారాలు
[మార్చు]- 2020 - ఉత్తమ నటిగా సైమా అవార్డు – కన్నడ నామినేట్ చేయబడింది. - దియా[12]
- 2020 - ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - కన్నడ నామినేట్ చేయబడింది. - దియా[13]
- 2021 - చందనవన ఫిల్మ్ క్రిటిక్స్ అకాడమీ అవార్డ్ ఉత్తమ నటి - దియా[14]
మూలాలు
[మార్చు]- ↑ V, Indian Express (24 March 2020). "Life after Dia, for Kushee". The New Indian Express. Retrieved 24 March 2020.
- ↑ Indian Express, The New (24 March 2020). "Dia-fame Kushee's next is Nakshe". Cinema Express. Retrieved 24 March 2020.
- ↑ Eenadu (17 August 2021). "DIA: కన్నడ బ్లాక్ బస్టర్ 'దియా' ఇప్పుడు తెలుగులో వచ్చేస్తోంది!". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
- ↑ "Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన 'పిండం' ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్! | Pindam Movie First Look Poster Launched by Hero Sree Vishnu KBK". web.archive.org. 2023-10-19. Archived from the original on 2023-10-19. Retrieved 2023-10-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Theresa, Deena (28 February 2019). "'ದಿಯಾ' ಚಿತ್ರದ ನಾಯಕಿ ಖುಷಿ ಅವರ ಗಂಡ, ಮಗು, ಫ್ಯಾಮಿಲಿ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿದೆ ಫುಲ್ ಡಿಟೇಲ್ಸ್!". Vijaya Karnataka. Retrieved 8 March 2020.
- ↑ V, The New Indian Express (17 December 2020). "'Dia' heroine Kushee Ravi takes spooky course". The New Indian Express. Retrieved 17 December 2020.
- ↑ V, The Times of India (21 December 2020). "Kushee Ravi completes 80% of her film, Spooky College". The Times of India. Retrieved 21 December 2020.
- ↑ V, The Times of India (24 March 2020). "'Dia' actress Kushee to play the lead in 'Nakshe'?". The Times of India. Retrieved 25 March 2020.
- ↑ Lokesh, Vinay (8 December 2021). "Shri and Kushee Ravi team up for 15-minute film". The Times of India.
- ↑ Sharadhaa, A. (20 September 2021). "Kushee to debut in Telugu with Vi Anand's next". Cinema Express.
- ↑ "'Spooky College' movie review: Questions mystery among youthful minds". The New Indian Express. 10 January 2023.
- ↑ "The 9th South Indian International Movie Awards Nominations for 2020". South Indian International Movie Awards. Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
- ↑ "67th Parle Filmfare Awards South 2022 with Kamar Film Factory". Filmfare. Retrieved 18 October 2022.
- ↑ Madhu, Vignesh (20 February 2021). "Chandanavana Film Critics Academy Award announced 2021; cfca awards 2021 dhananjaya and kushee win best actors award in lead role!". cinimirror. Retrieved 20 February 2021.