Jump to content

గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం (కనగాల)

అక్షాంశ రేఖాంశాలు: 16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
వికీపీడియా నుండి
గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం
గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం is located in ఆంధ్రప్రదేశ్
గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం
గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:బాపట్ల జిల్లా
ప్రదేశం:కనగాల
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం

గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం బాపట్ల జిల్లా కనగాల గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

స్థల పురాణం

[మార్చు]

త్రేతాయుగంలో కణ్వమహర్షి ప్రతిష్ఠించాడు పూజంచి అప్పటి రోజుల్లో ఇక్కడ ఉన్న పట్టణాన్ని కణ్వపురిగా పిలిచేవారు. కాలక్రమేణా ఆపేరు కనలగా నామాంతరం చెందినది. కణ్వమహర్షి చేత ప్రతిష్ఠించబడిన తరువాతి కాలంలో ఈ దేవాలయం శిథిలమై పోయింది. కలియుగంలో శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక బ్రాహ్మణ శాపానికి గురి అయ్యాడు. ఆ శాప నివారణార్థం శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు నూటొక్క శివాలయాలను నిర్మించ సంకల్పించాడు. ఆ పరంపరలో శివాలయాలు నిర్మించదలచిన ప్రదేశాలను గుర్తించి, అక్కడకు బళ్ళలో రాళ్ళను తోలించడం ప్రారంభించాడు. అలా వివిధ ప్రాంతాలకు రాళ్ళు తీసుకు వెళుతున్న సమయంలో రాళ్లు తీసుకెళ్తున్న వాహనం అదుపు తప్పి ప్రస్తుతం ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి ఆగింది.బండ్ల యజమాని పడిపోయిన ఆ బండిని తీయడం కోసం మిగిలిన బండ్ల వాళ్లందరినీ పిలిచి బండిని తీస్తున్న సమయంలోలో చిన్న లింగాకారం బయటపడింది. అప్పుడు బండ్ల యజమాని అటుగా వస్తున్న ప్రతీ బండిలోంచి కొన్ని రాళ్ళను అక్కడ వెయ్యాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అలా గుట్టలు పడిన రాళ్ళతో ఈ శివాలయం పని ప్రారంభమయింది. కోటిపల్లిలోని శివాలయం నిర్మాణం పూర్తి అయ్యే సరికి కనగాలలోని ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. ఆ విషయం బండి యజమాని జమీందారుకి చెప్పగా పూజలు, నైవేద్యాలు జరపడానికి కావలసిన మాన్యాలను బహూకరించారు జమీందారు. తరువాత ఈ ఆలయం రాచూరి జమీందారి ఆధీనంలోకి వెళ్ళింది.[1]

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.