గంగా విలాస్ క్రూయిజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగా విలాస్ క్రూయిజ్

గంగా విలాస్ క్రూయిజ్ అనేది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది క్రూయిజ్ నౌక.[1] దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడీ 13 జనవరి 2023న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించాడు.[2] ఇది 2 దేశాలు, 5 రాష్ట్రాలు, 27 నదీ వ్యవస్థల మీదుగా 51 రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొదటి క్రూయిజ్ నౌక. దీనిని అంటారా లగ్జరీ రివర్ క్రూయిజ్ సంస్థ నిర్మించింది.[3]

ప్రయాణం

[మార్చు]

గంగా విలాస్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్‌కు 51 రోజుల్లో 27 నదీ వ్యవస్థల వెంట 3,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది పాట్నా (బీహార్), షాహిబ్‌గంజ్ (జార్ఖండ్), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), ఢాకా (బంగ్లాదేశ్), గౌహతి (అస్సాం), దిబ్రూఘర్ (అస్సాం)లలో ఆగుతుంది. ఇది 36 మంది పర్యాటకుల సామర్థ్యం గల నౌక, ఇందులో 40 మంది సిబ్బంది ఉంటారు. ఈ నౌక తొలి ప్రయాణం కోసం, స్విట్జర్లాండ్ నుండి 32 మంది పర్యాటకులు మొత్తం ప్రయాణానికి బుక్ చేసుకున్నారు. ఈ నౌక మార్చి 2024 వరకు పూర్తిగా బుక్ చేయబడింది.[4] వారణాసి నుండి దిబ్రూఘర్‌కు 51 రోజుల పర్యటనకు టికెట్ ధర ఒక్కరికి ఒక్క రోజుకు కూ.25000, 51 రోజులకి 12.59 లక్షలు ఖర్చవుతాయి. గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణంలో బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గౌహతి వంటి కీలక నగరాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నది ఘాట్‌లు ఉన్నాయి. ఈ క్రూయిజ్ 51 రోజుల ప్రయాణంలో యాభైకి పైగా గమ్యస్థానాలు సందర్శించవచ్చు.

సౌకర్యాలు

[మార్చు]

గంగా విలాస్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు ఉన్నాయి. అవి 12 మీటర్ల వెడల్పు, 62 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల డ్రాఫ్ట్‌ తో సౌకర్యవంతంగా ఉంటాయి.[5] నౌకలో విలాసవంతమైన రెస్టారెంట్, స్పా, సన్డెక్ కూడా ఉన్నాయి. మెయిన్ డెక్లోని 40 సీట్ల రెస్టారెంట్లో కాంటినెంటల్, ఇండియన్ వంటకాలతో కొన్ని బఫే కౌంటర్లు ఉన్నాయి. పైన డెక్ లో టేక్ స్టీమర్ కుర్చీలు, కాఫీ టేబుల్ లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సూట్‌ లలో స్నానాల గది, కన్వర్టిబుల్ బెడ్లు, ఫ్రెంచ్ బాల్కనీ, టీవీ, సేఫ్, స్మోక్ అలారంలు, లైఫ్ వెస్ట్లు , స్ప్రింక్లర్ల వంటి అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి.

పర్యావరణ ప్రభావం

[మార్చు]

పర్యావరణవేత్తలు, పరిరక్షకులు గంగా విలాస్ క్రూయిజ్ ఫలితంగా గంగా నది డాల్ఫిన్ (ప్లాటానిస్టా గాంగెటికా) నివాసానికి నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "MV Ganga Vilas, world's longest river cruise, to culminate in Assam's Dibrugarh". Hindustan Times. 2023-02-28. Retrieved 2023-06-09.
  2. "Ganga Vilas: PM Modi flags off world's longest river cruise, 51-day trip to cost Rs 12.59 lakh". Moneycontrol. 2023-01-13. Retrieved 2023-06-09.
  3. "Antara Ganga Vilas | Antara Cruises". Retrieved 2023-06-09.
  4. "Ganga Vilas cruise booked till March 2024: Ticket prices, booking details, route, all you need to know about the world's longest river cruise". The Times of India. 2023-01-13. ISSN 0971-8257. Retrieved 2023-06-09.
  5. "MV Ganga Vilas: ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్ ప్రయాణం.. ధర తెలిస్తే షాకవుతారు..!". Samayam Telugu. Retrieved 2023-06-09.
  6. Desai, Shweta (2023-01-13). "'World's longest river cruise' could threaten endangered Ganges dolphin, experts warn". The Guardian. ISSN 0261-3077. Retrieved 2023-06-09.