గంగా నది డాల్ఫిన్
గంగా నది డాల్ఫిన్ | |
---|---|
Size comparison against an average human | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Order: | |
Suborder: | |
Superfamily: | |
Family: | Platanistidae Gray, 1846
|
Genus: | Platanista
|
Species: | P. gangetica
|
Binomial name | |
Platanista gangetica Lebeck, 1801; Roxburgh, 1801
| |
ఉపజాతులు | |
Platanista gangetica gangetica | |
Ranges of the Ganges River Dolphin and of the Indus River Dolphin |
గంగా నది డాల్ఫిన్ (లాటిన్ Platanista gangetica) ఒక రకమైన నదీ జలాలలో జీవించే డాల్ఫిన్. ఈ నదీ డాల్ఫిన్లు ఎక్కువగా బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్థాన్ దేశాలలో విస్తరించింది. ఈ గంగా నది డాల్ఫిన్ ప్రాథమికంగా గంగా, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులలో కనిపిస్తాయి. ఇవి, సింధు నది డాల్ఫిన్లు 1970 నుండి 1998 మధ్యలో రెండు వేర్వేరు జాతులుగా పరిగణించారు; అయితే 1998 నుండి ఈ రెండింటిని రెండు వేర్వేరు ఉపజాతులుగా భావిస్తున్నారు.
ఇతర పేర్లు
[మార్చు]గంగా డాల్ఫిన్, గంగా శుశు, శుశుక్
వర్గీకరణ
[మార్చు]లెబెక్, రాక్స్ బర్గ్ అనే ఇద్దరు పరిశోధకులు 1801 సంవత్సరంలో రెండు గంగా నదీ డాల్పిన్ల జాతులను గుర్తించారు.[1] 1970 వరకు సింధు, గంగా నది డాల్పిన్లను ఒకే జాతికి చెందినవిగా భావించారు. ఇవి రెండు సమూహాలు భౌగోళికంగా వేర్వేరుగా ఉండి కొన్ని వందల సంవత్సరాలగా జతకట్టలేదు. కపాల నిర్మాణం, వెన్నుపూసలు, కొవ్వు పదార్ధాల ఆధారంగా ఇవి రెండూ వేర్వేరు జాతులుగా 1970 లో గుర్తించారు.[2] 1998లో జరిపిన పరిశోధనల ఫలితంగా వీటిని తిరిగి ఒకే జాతికి చెందిన రెండు ఉపజాతులుగా గుర్తించారు. ఏది నిజమన్నది ఆధునిక మోలిక్యులర్ బయాలజీ టెక్నాలజీ సాయంగా తేల్చాల్సి ఉంది. అయితే అంతవరకు వీటిని రెండు ఉపజాతులుగా గుర్తించడం మంచిది; ప్రజాతి ప్లాటానిస్టాలో ఇండస్ నది డాల్ఫిన్ (Platanista gangetica minor), గంగా నది డాల్ఫిన్ (Platanista gangetica gangetica).[3]
శరీర నిర్మాణం
[మార్చు]గంగా నది, సింధు నది డాల్ఫిన్లు రెండు ఒకే విధమైన నిర్మాణం కలిగివుంటాయి. అన్ని నదీ డాల్ఫిన్ల మాదిరిగా ఇవి పొడవుగా మొనదేలిన ముక్కు వుంటుంది. వీని పై, క్రింది దవడ పళ్ళు నోరు మూసినా కూడా కనిపిస్తాయి. ఇవి పిల్లలలో సుమారు ఒక అంగుళం పొడవుగా, సన్నని వంపు తిరిగి ఉంటాయి. పెరిగిన డాల్ఫిన్లలో ఇవి చదరంగా, చదును బిళ్ళలుగా ఉంటాయి. ఈ జాతి జీవులకు శుక్లం ఉండక పోవడం వలన ఇవి అంధత్వంతో జీవిస్తాయి. అయినా కొంతవరకు కాంతిని గుర్తించగలుగుతాయి. వేట, ప్రయాణమంతా ఎకోలోకేషన్ తోనే సాగిస్తాయి. శరీరం గోధుమ రంగులో ఉండి మధ్యన లావుగా ఉంటుంది. వీనికి పృష్టభాగంలోdorsal fin స్థానంలో త్రికోణాకరపు చిన్న బుడిపె ఉంటుంది. ఫ్లిప్పర్లు, తోక సన్నగా పెద్దవిగా మగజీవులలో సుమారు 2-2.2 మీటర్లు, ఆడజీవులలో 2.4-2.6 మీటర్లు ఉంటాయి. అత్యధిక కాలం అంటే 28 సంవత్సరాలు జీవించిన మగజీవి 199 సెంటీమీటర్లు పొడవున్నట్లు రికార్డు చేయబడింది.[4] పరిణతి చెందిన ఆడజీవులు మగజీవుల కంటే పెద్దవిగా ఉంటాయి. Sexual dimorphism ఆడజీవులలో సుమారు 150 సెం.మీ. పెరిగిన తర్వాత జరుగుతుంది; ఆడజీవులలో rostrum మగజీవులవలె ఆగకుండా పెరిగి సుమారు 20 సెం.మీ. పొడవు పెరుగుతుంది. పిల్లల్ని జనవరి, మే మధ్యన కంటాయి. ఇవి కొద్ది నెలల కంటే తల్లితో ఉండవు. గర్భావధి కాలం సుమారు 9-10 నెలలుంటుంది.
ఈ జాతి జీవులు కార్ప్, మర్పు వంటి చేపలు, రొయ్యలు తింటాయి. డాల్ఫిన్లు వేరువేరుగా ఉంటాయి, పెద్ద పెద్ద సమూహాలను ఏర్పరచవు.
మానవుల ప్రభావం
[మార్చు]భారతదేశంలోని నదుల ఉపయోగం వలన ఈ రెండు రకాల జీవజాతులను తీవ్రంగా బాధించాయి. చేపల వలల్లో ఇరుక్కుని కొన్ని మరణించాయి. కొన్నింటిని వీటి నుండి లభించే నూనె, మాంసం కోసం చంపుతున్నారు. వీటిని పిల్లిచేపలకు ఆహారంగా వాడతారు. వ్యవసాయం మూలంగా నీటి లోతు తగ్గిపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక కాలుష్యాలు నీటి నాణ్యతను తగ్గించి వీటి నాశనానికి దారితీశాయి. వీటన్నింటికంటే ముఖ్యమైనది నదులపై నిర్మించిన 50 పైగా బహుళార్ధక ప్రాజెక్టులు; వాటి మూలంగా డాల్ఫిన్ ల బ్రీడింగా తగ్గిపోయి వాటి వృద్ధి మందగించింది. ప్రస్తుతం మూడు సింధు నది డాల్ఫిన్ జీవసమూహాలు మాత్రమే మిగిలాయి వీటిని రక్షించుకొంటే మంచిది.[5]
రెండు ఉపజాతులు కూడా IUCN అంతరించిపోతున్న జీవుల జాబితా Red List of Threatened Speciesలో చేర్చబడ్డాయి.[6]
గంగా నది డాల్ఫిన్ లకు ప్రస్తుత ప్రమాదం జాతీయ చంబల్ సంరక్షణాలయంలో తగ్గిపోతున్న లోతు, ఇసుక మేట మూలంగా నీటి ప్రవాహం తగ్గడం.[7]
మూలాలు
[మార్చు]- ↑ Kinze, C.C., 2000. Rehabilitation of Platanista gangetica (Lebeck, 1801) as the valid scientific name of the Ganges dolphin. Zool. Med. Leiden, 74: 193-203.
- ↑ Pilleri, G., Marcuzzi, G. and Pilleri, O., 1982. Speciation in the Platanistoidea, systematic, zoogeographical and ecological observations on recent species. Investigations on Cetacea, 14: 15-46.
- ↑ Rice, DW (1998). Marine mammals of the world: Systematics and distribution. Society for Marine Mammalogy. ISBN 978-1891276033.
- ↑ Kasuya, T., 1972. Some information on the growth of the Ganges dolphin with a comment on the Indus dolphin. Sci. Rep. Whales Res. Inst., 24: 87-108.
- ↑ Braulik, G.T., 2006. Status assessment of the Indus River dolphin, Platanista gangetica minor, March-April 2001. Biological Conservation, 129: 579-590.
- ↑ Smith, BD; Braulik, GT (2004). "2006 IUCN Red List of Threatened Species: Platanista gangetica". iucnredlist.org IUCN Red List]. Archived from the original on 2007-11-19. Retrieved 2007-03-30.
- ↑ Singh, L. A. K. and Sharma, R. K. (1985): Gangetic dolphin, Platanista gangetica: Observations on habits and distribution pattern in National Chambal Sanctuary. J. Bombay nat. Hist. Soc., Vol. 82(3), December 1985: 648-653, 2 figs. https://web.archive.org/web/20071025220659/http://www.geocities.com/laksingh33/ch_dol.PDF
బయటి లింకులు
[మార్చు]- Video of 10 Dolphin Sitings by Humbal Archived 2007-11-24 at the Wayback Machine
- ARKive - images and movies of the ganges river dolphin (Platanista gangetica)
- IUCN Red List entry for Ganges River Dolphin
- IUCN Red List entry for Indus River Dolphin
- Convention on Migratory Species page on the Ganges River Dolphin
- Walker's Mammals of the World Online - Ganges River Dolphin Archived 2004-10-10 at the Wayback Machine
- Whale & Dolphin Conservation Society (WDCS)