గంగిరెద్దుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగిరెద్దుల వారు.

గంగిరెద్దుల ఒక వెనుకబడిన కులం - ఏ గ్రూపు. సంక్రాంతి పండుగ నెలపెట్టిందంటే ఊరూర డూడూ బసవన్నల నృత్యాలతో ఇంటి ముంగిట కనువిందు చేస్తాయి. ఈ ఆనందాన్ని తిలకించి వారు పెట్టే పిడికెడు గింజలతో పొట్టనింపుకొని దేశసంచారం చేస్తారు గంగిరెద్దులవారు. సంవత్సరంలో ఆరునెలల కాలం పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు గంగిరెద్దులతో కుటుంబ సమేతంగా వలసలు వెళతారు.

వీరిలో రెండు తెగలు. ఒకరు పూర్తిగా గంగిరెద్దుల మీద జీవనం సాగిస్తుండగా, మరొక తెగ యక్షగాన కళాకారులు. వీరు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వీధి నాటకాలు ప్రదర్శించి వారిచ్చే సంభావనతో కుటుంబాలు పోషించుకుంటారు. మోటుపల్లి గ్రామంలో యక్షగాన కళాకారులున్నారు. ప్రదర్శించే కళల ద్వారా యాదవులు మందకొక గొర్రెను సంభావన కింద ఇస్తారట. టివీలు, సినిమాల ప్రభావంతో నాటి కళారూపకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఆ వృత్తిని తమ పిల్లలకు నేర్పించటం లేదు.వీరిలో బాల్యవివాహాలు సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. గంగిరెద్దుల వారు మాత్రం తమ వారసత్వాన్ని కొనసాగింపుతో జీవనాన్ని నెట్టుకొస్తుండగా, యక్షగాన తెగ వారు ఆదరణ లేక మానేస్తున్నారు. కుటుంబ సమేతంగా వలస వెళుతున్నందు వలన వీరికి సంక్షేమ కార్యక్రమాలు అందటం లేదు.