Jump to content

గంగు బాబా

వికీపీడియా నుండి
గంగు బాబా
ఉరిశిక్షకు ముందు 8 సెప్టెంబర్ 1859 , కాన్ పూర్
జననం
మరణం8 సెప్టెంబర్
చుంణిగంజ్ , ఉత్తర ప్రదేశ్
నానా సాహెబ్ పేష్వా ఆర్మీ ,1857 ముటినీ ఎగైనెస్ట్ బ్రిటిషర్లు
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం

గంగు బాబా, భారతదేశానికి చెందిన తిరుగుబాటుదారుడు. అతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిథూర్ గ్రామానికి చెందిన బల్మికి కులస్థుడు.

గంగు బాబా జీవితం

[మార్చు]

గంగు బాబా అడవి నుండి చనిపోయిన పులిని వీపుపై వేసుకొని తిరిగొస్తుండగా, బిత్తూర్ రాజైన నానా సాహెబ్ పేష్వా తన సైన్యంతో ఆ ప్రదేశం నుండి వెళ్తుండగా గంగు బాబా ధైర్య సాహసాలను చూసి తన సైన్యంలో చేరమని అడగగా, గంగు బాబా వెంటనే అంగీకరించాడు. గంగు బాబా అప్పటికే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించాడు. సైన్యంలో చేరిన అతను బిత్తూర్ సమీపంలోని గ్రామాల్లోని దళితుల మౌఖిక సంప్రదాయాల ప్రకారం, అతను తన కత్తితో 150 మంది బ్రిటిష్ సైనికులను చంపాడు. దీనిపై ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం అతడిని సజీవంగా లేదా మరణించిన అరెస్ట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసి చివరకు, అతడిని అరెస్టు చేశారు. బ్రిటిష్ సైనికులు అతడిని గుర్రానికి కట్టేసి కాన్పూర్ వరకు తీసుకువెళ్లి చున్నిగంజ్‌లో అతడిని ఉరితీశారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Bates, Crispin (30 October 2013). Mutiny at the Margins: New Perspectives on the Indian Uprising of 1857: Volume V: Muslim, Dalit and Subaltern Narratives. ISBN 9788132118640.
  2. Campus Chronicle (18 August 2020). "The Great Unsung Martyred Warrior 'Gangu Baba'". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=గంగు_బాబా&oldid=4055488" నుండి వెలికితీశారు