Jump to content

గంటి భానుమతి

వికీపీడియా నుండి
గంటి భానుమతి
గంటి భానుమతి చిత్రం
ఇతర పేర్లుభానుమతి
విద్యడి.ఫార్మసీ,బి.ఎ
ఎం.ఏ.
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవయిత్రి, రచయిత్రి
పిల్లలుఆదిత్య, అరవింద్.
తల్లిదండ్రులుభద్రాద్రిరాముడు, లక్ష్మీబాయి

గంటి భానుమతి ప్రముఖ రచయిత్రి. ఈమె 8 నవలలు, 6 కథా సంపుటాలు, వందకు పైగా కవితలు, వ్యాసాలు రచించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె జన్మస్థలం తెలంగాణకు చెందిన హైదరాబాదు నగరం. ఆమె తల్లి లక్ష్మీబాయి (కమలాబాయి), తండ్రి భద్రాద్రి రాముడు ఇరువురూ ఉపాధ్యాయులు. ఆమె ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను హైదరాబాదులోని మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో చదివింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డి.ఫార్మసీ, బి.ఏ డిగ్రీలు పొందింది. ఆమె ఆంగ్లంలో ఎం.ఎ కూడా చేసింది.[1]

సాహితీ ప్రయాణం

[మార్చు]

ఆమె కవితలు రాయడంతో రచనా వ్యాసంగం ప్రారంభించింది. 14వ యేట నుంచే స్కూలు, కళాశాల మ్యాగజైన్లకు వ్యాసాలు కథలు రాసింది. ఆమె ఇంత వరకు 200 కథలూ, 10 నవలలూ, వందకి పైగా వ్యాసాలు, కవితలూ రాసింది.

రచనలు[2]

[మార్చు]

నవలలు

[మార్చు]
  1. గ్రహణం
  2. ఆఖరి ప్రయాణం
  3. అనగనగా ఒకరోజు
  4. ఆ యిద్దరు
  5. తప్పటడుగు
  6. అన్వేషణ
  7. ఆమె గెలిచిందా? ఓడిందా?[1]

కథాసంపుటాలు

[మార్చు]
  1. స్వాభిమానం
  2. ఒక్కసారి మావూరు పోయిరావాలి
  3. సాగరమథనం
  4. ఎంత సుదీర్ఘమీ జీవితం
  5. జీవనపోరాటం
  6. ఇదే ధర్మమా?
  7. అమ్మకో ఉత్తరం[3]

ఇతరములు

[మార్చు]
  1. ఎందరో మహానుభావులు

పురస్కారాలు

[మార్చు]

ఆమె రాసిన ఎన్నో కథలకు, నవలలకు బహుమతులు వచాయి. వీటిలో 2016 సంవత్సరానికి గానూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి "రచయిత్రి ఉత్తమ గ్రంథం"పురస్కారం ముఖ్యమైనది. ఆమెకు 2019లో సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం లభించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె గంటి పేరిశాస్త్రిని వివాహమాడింది. వారికి ఇరువుతు పిల్లలు . వారు ఆదిత్య, అరవింద్.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ame Gelichinda? Odinda?: Novel (in Telugu). Ganti Prachuranalu. 2016.{{cite book}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  2. Ganti Bhanumathi | Authors | Home - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2019-12-22. Retrieved 2020-04-29.
  3. "Pin on Telugu Books". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2020-04-29.