గణేష్ లడ్డూ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయబడిన వినాయకుని మట్టి విగ్రహం (విద్యుదీపాలంకరణలో) - ఈయన చేతికి చేరిన లడ్డూ ప్రసాదంగా పొందిన వారు కీర్తిప్రతిష్ఠలు పొందుతారని హిందువుల ప్రగాఢ విశ్వాసం

వినాయక చవితి రోజున మట్టితో తయారు చేసిన వినాయకుడుని నెలకొల్పి 1 నుంచి 11 రోజుల లోపు నిమజ్జనము అయ్యే రోజు వరకు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయకుడిని నిమజ్జనము చేసే ముందు వినాయకుని మట్టి విగ్రహానికి భక్తులు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. వినాయకుని గ్రామోత్సవానికి ముందు వినాయనికి నైవేద్యంగా ఆర్పించే వాటిలో లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది.


లడ్డూ వేలంపాట[మార్చు]

వినాయకస్వామికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను కొన్ని ప్రాంతాలలో వేలం వేసి వేలంపాటలో అధిక మొత్తాన్ని వెచ్చించిన వ్యక్తికి ఈ లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇప్పటికి 2012 లో తాపేశ్వరం లో ఉన్న వినాయకుని లడ్డూ 6300 కి.గ్రా. లతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు లో నమోదైంది. దీని తయారీకి 9 గంటల 20 నిముషాలు పట్టింది.[1]

బాలాపూర్ విశిష్టత[మార్చు]

  • బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980 లో ప్రారంభం అయ్యింది.
  • లడ్డూ వేలం మాత్రం 1994లో మొదలై 450 రూపాయలు పలికింది. అలా మొదలైన పాట అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది.
  • బాలాపూర్ లడ్డూ అంత ప్రాచుర్యం పొందటానికి కారణం ఇక్కడి లడ్డూ పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయనే నమ్మకం ఉండటం వలన.
  • లడ్డూ వేలం మొదలైన 17 సంవత్సరాల వరకూ స్థానికులకే అవకశం కల్పించిన వీరు తరువాత స్థానికేతరులకూ అవకాశం ఇస్తున్నారు.

అధిక మొత్తంలో పాడిన లడ్డూలు[మార్చు]

2012[మార్చు]

  • హైదరబాద్ అమీర్ పేట్ వీ.వీ.ఆర్.కనస్ట్రక్షన్ 12.15 లక్షలు[2]
  • సరూర్ నగర్ బాలాపూర్ పన్నాల గోవర్ధన్ రెడ్డి 7.50 లక్షలు

2014[మార్చు]

  • మాధవధార ప్రాంతంలో గణేష్ లడ్డూ 12.75 లక్షలు[3]
  • బాలాపూర్ - ఎస్.జయింద్ రెడ్డి - 9 లక్షల యాభై వేలు [4]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]