Jump to content

గద్ద, పావురాల కథ

వికీపీడియా నుండి
15వ శతాబ్దిలో హెన్రిచ్ స్టెయిన్‌హోవెల్ వేసిన ద్విభాషా (లాటిన్-జర్మన్) ఈసప్ కథల సంకలనంలో గద్ద, పావురాల కథకు వేసిన చిత్రం

గద్ద, పావురాల కథ అన్నది ఈసప్‌కు ఆపాదించబడిన రాజకీయ కథ. ఇది పెర్రీ సూచికలో 486వ కథ. మధ్య యుగాలలో ఒక డేగను అదనపు పాత్రగా ప్రవేశపెట్టడం ద్వారా దీన్ని విస్తరించి, ఇది చెప్పే నీతిని కొంత మార్చారు.

ఫేడ్రస్ సంకలనంలో కథ

[మార్చు]

ఈ కథ మొట్టమొదటగా క్రీ.పూ.50 నుంచి క్రీ.శ.50 వరకూ జీవించిన ఫేడ్రస్ (బుక్ 1.31) సేకరణలో కనిపిస్తుంది.[1] ఆ వెర్షన్ ప్రకారం కథ ఇలా ఉంటుంది: పావురాలపైన తరచు ఒక గద్ద దాడిచేస్తూండేది. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం సాగిస్తూన్న పావురాలు చాలా భయపడిపోయి ఉంటాయి. గద్ద తనని తమ రాజుగా, రక్షకునిగా ఎన్నుకుంటే రక్షణ ఉంటుందని సూచిస్తుంది. అప్పటికే భయంతో ఉన్న పావురాలు గద్దని రాజుగా ఎన్నుకుంటాయి. అయితే, రాజుగా తనకుండే విశేషాధికారాల్లో వాటి శరీరంపైన, ప్రాణంపైన ఉండే హక్కు ఒకటని చెప్తూ, దాని ప్రకారం ఒక్కోదాన్ని చంపి తినడం మొదలుపెట్టాకా తామెంత తప్పు చేశామో పావురాలకు అర్థమవుతుంది.

మధ్యయుగాల్లో ఫ్రేడస్ సంకలనం అందుబాటులో లేకుండా పోయినప్పుడు ఈ కథకు వేరే వెర్షన్ ఒకటి తయారైంది. పునరుజ్జీవన కాలంలో ఫ్రేడస్ సంకలనపు అసలు ప్రతి తిరిగి దొరకడంతో, ఆ తర్వాతి కలెక్షన్లలో దీని కథనాన్ని ఫ్రేడస్ రాసిన పద్ధతిలోనే రాయడం మళ్ళీ ప్రారంభమైంది. ఆంగ్లికన్ చర్చి మతాధికారి, అనువాదకుడు శామ్యూల్ క్రోక్సాల్ తాను సంకలనం చేసిన ఈసప్ కథల్లో తన కాలం నాటి రాజకీయ పరిస్థితులకు ముడిపెట్టి వ్యాఖ్యానిస్తూ, "చాలామంది, ఈ కథలోని పావురాల లాగానే, వెర్రితనంగా ఒక గద్దని రాజుగా అంగీకరిస్తారు కానీ రాజు లేకుండా ఉండాలనుకోరు" అని వ్యాఖ్యానించారు.[2] ఆ పుస్తకంలో మరో రెండు పేజీల తరువాత క్రోక్సాల్ తన వెర్షన్లోని ప్రతీ కథలోనూ ఫేడ్రస్ ఉద్దేశాలను దృష్టినే అనుసరించే ప్రయత్నం చేశానని చెప్పుకున్నాడు. (పే. 32).

మధ్యయుగాల వెర్షన్లు

[మార్చు]

మధ్యయుగాల్లో ఈ కథకు చాలా కొత్త వెర్షన్లు తయారయ్యాయి. ఆంగ్ల మతప్రచారకుడు, నీతికథా సంకలనకారుడు ఓడో ఆఫ్ షెరిటోన్ 12వ శతాబ్ది చివరిలో వీటిలో చాలావాటిని రికార్డు చేశాడు. వాటిలో కొన్ని

  • రాజు కావాలని కోరుకున్న కప్పలు కథ వీటిలో ఒక రూపాంతరం. దాని ప్రకారం, కప్పలన్నీ కలసి ఒక దుంగని తెచ్చి తమ రాజుగా ఎంచుకున్నాయి. దానివల్ల ఏ ప్రయోజనమూ లేదని భావించి, దాని బదులు ఒక పామును రాజును చేశాయి. చివరకు ఆ పాము వాటిని తీనేసింది.
  • మరొక రూపాంతరం ప్రకారం, కొన్ని కోడిపిల్లలు లేదా ఏవోక పక్షులు తమకు రాజుగా సౌమ్యంగా, తమకు ఏ హానీ చేయని పావురాన్ని ఎన్నుకున్నాయి. కానీ, దానికి అధికారం చెలాయించగల సామర్థ్యం లేదని భావించి, దాన్ని దించేసి ఒక డేగని రాజును చేశాయి. ఆ డేగ వాటన్నిటినీ తినేసింది.[3]
  • లాటిన్లో ఈసప్ కథలను సంకలనం చేసిన రోములుస్ ఆంగ్లికస్ ప్రకారం సాధారణంగా ఎప్పుడూ ప్రమాదంలో ఉండే పావురాలు తమను కాపాడమని ఒక గద్దని ఎన్నుకున్నాయి.[4]
  • గ్వాల్టరస్ ఆంగ్లికస్ అన్న ఆంగ్లో నార్మన్ కథా సంకలనకర్త ప్రకారం పావురాలు డేగలతో యుద్ధంలో ఉండి కాపాడడానికి గద్దని రాజుగా ఎన్నుకున్నాయి.[5] చివరకు సామాన్యంగా యుద్ధంలో చనిపోయే పావురాల కన్నా గద్ద చంపి తినేసిన పావురాల సంఖ్య బాగా ఎక్కువ అన్న వివరంతో కథ ముగుస్తుంది. పరిష్కారం అన్నది పరిస్థితి బాగోలేకపోతే దాన్ని మరింత దారుణమైన పరిస్థితిగా మార్చకూడదన్న నీతి చెప్తుంది.


మరొకటి కోళ్లకు సంబంధించినది, లేకుంటే సాధారణంగా పక్షులు, పావురాన్ని పాలకుడిగా ఎన్నుకుంటాయి, ఎందుకంటే అది సౌమ్యమైనది వాటికి ఎటువంటి హాని చేయదు; కానీ అది అధికారం లేదని భావించినప్పుడు, వారు దాని స్థానంలో గాలిపటంను ఎంచుకుంటారు మరియు దానిని వేటాడతారు. [6] రోములస్ ఆంగ్లికస్ యొక్క సంస్కరణలో, సాధారణ ముప్పు స్థితిలో నివసిస్తున్న పావురాలు తమ రక్షకుడిగా ఒక గద్దను ఎన్నుకుంటాయి, [7] అయితే ఇంగ్లాండ్ వాల్టర్ ప్రకారం పావురాలు గాలిపటాలతో యుద్ధం చేస్తున్నాయి మరియు వాటిని రక్షించడానికి ఒక గద్దను ఎంచుకుంటాయి. [8] గద్ద గతంలో మరణించిన వారి కంటే చాలా మందిని చంపిందనే వివరాలతో చివరి కథ ముగుస్తుంది మరియు పరిహారం చెడు పరిస్థితిని మరింత దిగజార్చకూడదనే సలహాతో ముగుస్తుంది.

తెలుగులో

[మార్చు]

తెలుగులో ఈసప్ కథలను నీతి కథా మంజరి పేరిట అనువదించిన కందుకూరి వీరేశలింగం పంతులు కథలో గద్ద పావురాలను పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి గూటిలో దూరి దాక్కోవడం వల్ల సాధ్యం కాదు. దానితో మాయోపాయంతో వాటి దగ్గరకు వచ్చి "నేను మీకు శత్రువునన్న సందేహంతో మీరు నాకు దూరంగా వెళ్తున్నారు. కానీ, సాధుపక్షులైన మీకు ఎన్ని ఆపదలు కలుగుతున్నాయో గమనించి డేగలు వంటి పక్షుల నుంచి మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను" అని నమ్మబలుకుతుంది. పావురాలు సంతోషించి గద్దకు రాజ్యాభిషేకం చేసి, ప్రభుభక్తితో సేవిస్తామని ప్రమణాలు చేస్తాయి. వాటి దేహప్రాణాలు రాజుగా తన సొత్తు కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని చెప్పి ఒక్కోదాన్నీ తినడం ప్రారంభిస్తుంది. వీరేశలింగం ఈ నీతితో ముగిస్తాడు "స్వభావ మెఱుగకు పరునికి దమపై అధికారవిచ్చి తమలో దెచ్చి పెట్టుకున్న పాపఫలమనుభవింపక తీఱదని (పావురములన్నియు నొకచోటచేరి) విలపింప జొచ్చెను."

దీనికి సారాంశంగా అతను రాసిన పద్యం ఇలా ఉంటుంది[9]:

గీ. పరుల నైసర్గిక గుణంబు లరయకుండ

విశ్వసించిన నాపదల్ వే ఘటిల్లు; దీర్ఘ ముగ గ్రొత్తవాని శోధింపకుండ

బ్రియసఖుండని యంగీకరింప జనదు

—కందుకూరి వీరేశలింగం పంతులు, నీతి కథా మంజరి

మూలాలు

[మార్చు]
  1. Christopher Smart, The Fables of Phaedrus, translation by Christopher Smart, London 1913
  2. Fables of Aesop and Others, pp. 29–30, London 1732
  3. Fables 1b, 1c and 1d
  4. Fable 20
  5. Fable 22
  6. Fables 1b, 1c and 1d
  7. Fable 20
  8. Fable 22
  9. వీరేశలింగం పంతులు, కందుకూరి. "గ్రద్ద, పావురము". నీతి కథా మంజరి.