ఈసప్ కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇటలీలో 13వ శతాబ్దపు నాటి నగిషీ బొమ్మలో "తోడేలు - కొంగ", "తోడేలు - గొర్రెపిల్ల" కథల చిత్రణ

ఈసపు కథలు, లేదా ఈసోపికా అనేది క్రీ.పూ. 620 - 564 మధ్యకాలంలో పురాతన గ్రీస్‌కు చెందిన బానిస, కథకుడు అయిన ఈసప్‌ రచించాడని చెప్పే కాల్పనిక కథల సమాహారం.[1][2] విభిన్న మూలాల నుంచి వచ్చిన ఈ కథలు రచయితగా ఈసప్ పేరుతో ముడిపడ్డాయి.[3][4] ఇవి ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకూ వివిధ లిఖిత, మౌఖిక సంప్రదాయాల నుంచి వచ్చాయి. మార్పులకు, వివిధ వ్యాఖ్యానాలకు గురై ఈనాటికీ వివిధ మాధ్యమాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి.[5]

ఈ నీతికథలు వాస్తవానికి మౌఖిక సంప్రదాయానికి చెందినవి.[6] ఈసప్ మరణానంతరం మూడు శతాబ్దాల వరకూ ఇవి సంకలనం కాలేదు.[7] ఆనాటికి ప్రాచుర్యంలో ఉన్న వివిధ ఇతర కథలు, జోకులు, సామెతలు అతనికి ఆపాదించారు. వీటిలో కొన్ని కథలు ఈసప్ కన్నా ప్రాచీనమైనవి, కొన్ని గ్రీక్ సాంస్కృతిక నేపథ్యానికి వెలుపల సంస్కృతుల నుంచి వచ్చినవి. కొత్త కథలు ఈసప్ నీతకథల జాబితాలో చేరడం అన్న ప్రక్రియ ఇటీవలి కాలం వరకూ కొనసాగుతోంది. ఇటీవల కాలం వీటిలో చేరుతున్నవాటిలో ఎక్కువ యూరప్ బయటి సంస్కృతులకు సంబంధించిన కథలు. ఈ కథల చేరిక ప్రక్రియ నిరంతరంగా సాగుతోంది, కొత్త కథలు మరీ ఇటీవల కాలంలో రాసినవని స్పష్టంగా తెలుస్తున్నా, వాటిలో కొన్ని ఆధునిక యుగంలో తెలిసిన రచయితల కథలే అయినా, అవి ఈసప్ కథల్లో చేరడం కొనసాగుతోంది.

ఈ కథల ప్రచారానికి, తరతరాలుగా ప్రసరించడానికి రెండు ముఖ్యమైన మూలాలు ఉపయోగపడ్డాయి. ఒకటి - గ్రీక్, లాటిన్ భాషల్లోని రాతప్రతులు, రెండు - యూరోపియన్ భాషల్లో వీటిని కవితాత్మకంగా తిరగరాసిన వెర్షన్లు.[8][9] వీటిలో గ్రీకు, లాటిన్ భాషల రాతప్రతులు ప్రధానమైనవి, మొదటివి కాగా యూరోపియన్ భాషల కవితాత్మక వెర్షన్లు తర్వాత వాటి నుంచి పుట్టుకువచ్చినవి.[10][11] ముద్రణా యంత్రం ఆవిష్కరణ తర్వాత వివిధ భాషల్లో మొట్టమొదట ప్రచురితమైన పుస్తకాల్లో ఈసప్ కథలు ఒకటి.[12] సంకలనాలు, అనువాదాలు, అనుసృజనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా నీతి కథల రచయితగా ఈసప్ పేరు ప్రఖ్యాతి చెందింది.[13]

మొదట్లో కథలు పాఠకులుగా పెద్దలను ఉద్దేశించి ఉండేవి.[14] అందుకు తగ్గట్టే కథలు మతపరమైన, సామాజిక, రాజకీయ ఇతివృత్తాలను కలిగి ఉండేవి. పునరుజ్జీవన కాలం నుంచి పిల్లల విద్యాబోధనలో నీతి నేర్పించడానికి వీటిని ఉపయోగించడం ప్రారంభమైంది.[15][16] ఈ కథలను శిల్పం, చిత్రలేఖనం, నాటకం, పాటలు వంటి కళల ద్వారా వాటిలోని నైతిక కోణాన్ని హైలైట్ చేస్తూ చిత్రీకరించడంతో, వీటిలోని నైతిక కోణం పెద్దల మనోప్రపంచంలో మరింతగా బలపడింది. దానికితోడు, ఈ కథల అర్థం పలుమార్లు పునర్ వ్యాఖ్యానానికి గురైంది, కథనంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నదానిలోనూ చాలా మార్పులు జరిగాయి.[17]

ఈసప్ కథల్లో కొన్ని[మార్చు]

 

మూలాలు[మార్చు]

 1. The Histories of Herodotus of Halicarnassus. trans. George Rawlinson, Book I, p. 132 Archived 19 ఆగస్టు 2006 at the Wayback Machine
 2. Aesop's Fables, ed. D.L. Ashliman, New York 2005, pp. xiii–xv, xxv–xxvi
 3. Christos A. Zafiropoulos (2001). Ethics in Aesop's Fables, Leiden, pp. 10–12
 4. John F. Priest, "The Dog in the Manger: In Quest of a Fable", in The Classical Journal, Vol. 81, No. 1, (October–November 1985), pp. 49–58.
 5. Ashliman, D.L. "Introduction", Aesop's Fables, 2003, p. xxii.
 6. "His Aesop. Fables (1692)". Mythfolklore.net. Retrieved 22 March 2012.
 7. van Dijk, Gert-Jan (1997). Ainoi, Logoi, Mythoi: Fables in Archaic, Classical, and Hellenistic Greek Literature, Leiden, Netherlands: Brill.
 8. Ashliman, D.L. "Introduction", Aesop's Fables, 2003, p. xxii.
 9. The Fables of Marie de France translated by Mary Lou Martin, Birmingham AL, 1979; limited preview to p. 51 at Google Books
 10. An English translation by Moses Hadas, titled Fables of a Jewish Aesop, first appeared in 1967. ben Natronai (Ha-Nakdan), Berechiah (2001). Fables of a Jewish Aesop. David R. Godine Publisher. ISBN 978-1567921311. Retrieved 22 March 2012.
 11. There is a discussion of this work in French in Épopée animale, fable, fabliau, Paris, 1984, pp. 423–432; limited preview at Google Books
 12. An English translation by Moses Hadas, titled Fables of a Jewish Aesop, first appeared in 1967. ben Natronai (Ha-Nakdan), Berechiah (2001). Fables of a Jewish Aesop. David R. Godine Publisher. ISBN 978-1567921311. Retrieved 22 March 2012.
 13. Lawrence Marceau, From Aesop to Esopo to Isopo: Adapting the Fables in Late Medieval Japan (2009); an abstract of this paper appears on p. 277 Archived 22 మార్చి 2012 at the Wayback Machine
 14. "Paragraph 156". Bartleby.com. Retrieved 2012-03-22.
 15. The 1753 London reprint of this and Faerno's original Latin is available online
 16. John Metz, The Fables of La Fontaine, a critical edition of the 18th century settings, New York 1986, pp. 3–10; available on Google Books
 17. "Préface aux Fables de La Fontaine". Memodata.com. Retrieved 22 March 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈసప్_కథలు&oldid=4132030" నుండి వెలికితీశారు