గద్వాల్ చీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గద్వాల్ చీర
రూపకర్తగద్వాల్ చేనేతకారులు
సంవత్సరం1930
రకంచీర
మెటీరియల్పట్టు
గద్వాల చీర
గద్వాల చీర
గద్వాల చీరలు
గద్వాల చీరలు

గద్వాల్ చీర భారతదేశం లోని మహబూబ్ నగర్ జిల్లాలో తయారవుతున్న సాంప్రదాయక చీర .[1] ఇవి జరీ తోకూడుకొని ప్రసిద్ధి పొందాయి. బ్రొకేడ్ శారీస్, కాంట్రాస్ట్ పల్లూ, బార్డర్, ప్యాటర్స్కి ఈ చీర పెట్టింది పేరు.హంసల బార్డర్ మరో ప్రత్యేకత.[2]

విశేషాలు

[మార్చు]

గద్వాల్ చీర తెలంగాణ చేనేత పరిశ్రమకు పట్టుకొమ్మ. మహబూబ్నగర్లోని గద్వాల్లో తయారయ్యే చీరలు దేశంలోనే మన్నికైనవి, పేరెన్నిక గన్నవి. ఇక్కడి నుంచి దేశంలోని ప్రముఖ పట్టణాలకు ఈ కళాత్మక చీరలు ఎగుమతి అవుతాయి. ఎంతో నాణ్యత గల జరీ చీరలను నేసే ఇక్కడి కళాకారులు ఇప్పటికీ తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ చీరల తయారీకి నూలు, పట్టు పోగుల నుంచి దారం తీయడం, వివిధ రకాల రంగులు అద్దడం మొదలుకుని ఎంతో ఓర్పు, నేర్పుతో నేయడం వాటిని రోల్ చేయడం, చీర తయారు చేసేవరకు ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే.

5.5 మీటర్ల పొడవుతో గల చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టినంత నేయగల సామర్థ్యం ఉన్న చేనేత కార్మికులు ఇచట ఉన్నారు. ఈ చీరలు 1930 నుండి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నూలు, పట్టుపోగుల నుంచి దారం తీయడం, వివిధ రకాల రంగులు అద్ది కళాత్మకమైన చీరలను నేస్తారు. చీర పై, కింది అంచులు జరీతో ఉండి, అంచులు మరోసారి నేసి తర్వాత ప్రత్యేకంగా జోడిస్తారు. చీరకు కావలసిన పట్టు దారాలు, అంచులు, కొంగులకు జరీని వాడుతారు.

చేనేత పరిశ్రమ

[మార్చు]

చేనేత పరిశ్రమలో ముఖ్యంగా చీరల తయారీలో గద్వాల పట్టణం జిల్లా లోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ పేరు సంపాదించింది. ఇక్కడి నుంచి ప్రముఖ పట్టణాలకు వస్త్రాలు ఎగుమతి అవుతుంటాయి. చేనేత వస్త్రాలకు డిమాండు తగ్గిననూ అతినాణ్యత కల జరీ చీరలు నేసే కళాకారులు గద్వాలలో ఇప్పటికీ ఉన్నారు. బ్రిటీష్ కాలంలో చేనేత కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం లభించకున్ననూ సంస్థానాధీశులు మాత్రం వీరిని ప్రోత్సహించారు. గద్వాల సంస్థానాధీశుల కాలంలో అప్పటి మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల నుంచి ఇద్దరు చేనేత కళాకారులను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసికి పంపించి బనారస్ జరీ చీరలను నేసేందుకు శిక్షణ ఇప్పించింది.[3]

తిరుమలేశునికి గద్వాల పంచెలు

[మార్చు]

సుమారు నాలుగు శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది. నాటి రాజు సీతారాం భూపాల్ గద్వాల సంస్థానాధీశుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామివారికి పంచెలను సమర్పించే పద్ధతిని ప్రవేశపెట్టాడు.[4] అతని వారసులు నేటికికూడా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

గద్వాల్ హాండ్లూం సెంటర్

[మార్చు]
గద్వాల్ స్టేషన్

ఇది 1946లో స్థాపించబడింది. దీనిని లేటు రతన్ బాబూరావు స్థాపించారు. ఈ చీరల గూర్చి విస్తృతంగా ప్రచారం చేయుట కొరకు ఈ సంస్థ ప్రారంభించబడింది. ఆయన యొక్క దుకాణం సాంప్రదాయక చీరల అమ్మకానికి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.

భౌగోళిక గుర్తింపు చట్టం

[మార్చు]

భారత ప్రభుత్వం వారు ఒక భౌగోళిక ప్రాంతానికి చెందిన కళాకారులు, మానుఫాక్సరర్స్, ఉత్పత్తి దారులు తయారు చేసిన వస్తువుల రక్షణ కొరకు వస్తువుల భౌగోళిక గుర్తింపు చట్టాన్ని రూపొందించారు.ఈ చట్టం క్రింద గద్వాల్ చీరలను రిజిష్టర్ చేయడం జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. "Gorgeous Gadwal". Deccan Herald.
  2. చక్రం తిప్పిన హ్యాండ్లూం Sakshi | Updated: August 13, 2015 22:46 (IST)[permanent dead link]
  3. ఆంధ్రప్రభ దినపత్రిక, మహబూబ్ నగర్ ప్రత్యేక అనుబంధం (2006), పేజీ 36,
  4. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 8, తేది 05.09.2008

ఇతర లింకులు

[మార్చు]